Breaking News

నవీన్‌ చంద్ర, వరలక్ష్మి శరత్ కుమార్‌లతో ప్రేమ పాట

Published on Thu, 03/05/2026 - 10:55

వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, నవీన్‌ చంద్ర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘పోలీసు కంప్లెంట్‌’.  ఎంఎస్‌కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్ బ్యానర్‌పై, బాలకృష్ణ మహారాణా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ మూవీలోని బ్యూటిఫుల్ మెలోడియస్ సాంగ్ ‘ప్రేమ ఓ ప్రేమ’ని సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు ప్ర‌భు లాంచ్ చేశారు. ఈ పాట‌ అన్విక ఆడియోస్ ద్వారా రిలీజ్ అయింది.

"ప్రేమ ఓ ప్రేమ" పాటకు సంగీతం సుధాకర్ మారియో సమకూర్చారు. ఈ పాట యూత్‌కు బాగా న‌చ్చుతుంద‌ని, ట్రెండింగ్‌గా నిలిచిపోతుంద‌ని, సూప‌ర్ హిట్ ల‌వ్ సాంగ్స్‌ల్లో ఈ పాట కూడా చోటు ద‌క్కించుకుంటుంద‌ని దర్శకుడు సంజీవ్ మేగోటి న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేశారు.  హారర్ థ్రిల్లర్, అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఈ సినిమా తెర‌కెక్కించిన‌ట్టు తెలిపారు.

యాక్షన్, కామెడీ, రొమాన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన‌ ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర, రాగిణి ద్వివేది, కృష్ణ సాయి, ఆదిత్య ఓం, రవిశంకర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, రవిశంకర్, పృథ్వి, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, శరత్ లోహితశ్వ, జెమినీ సురేష్, దిల్ రమేష్ తదితరులు నటిస్తున్నారు. దాదాపు 52 మంది సీనియర్ ఆర్టిస్టులతో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో ఎస్.ఎన్. హరీష్ సినిమాటోగ్రఫీ, డ్రాగన్ ప్రకాష్–రవితేజ ఫైట్స్ హైలైట్‌గా నిలుస్తాయని తెలిపారు. వరలక్ష్మి శరత్‌కుమార్, నవీన్ చంద్ర, రాగిణి ద్వివేది పాత్రలు వారి గత చిత్రాలకు భిన్నంగా ఉంటాయని తెలిపారు. ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని త్వ‌ర‌లోనే విడుద‌ల చేయ‌నున్నారు.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)