Breaking News

ఇంటి తాళం పగులగొట్టి నానా బీభత్సం.. బెల్లంకొండపై కేసు నమోదు!

Published on Tue, 11/11/2025 - 13:28

సాక్షి, ఫిలింనగర్‌(హైదరాబాద్‌): ప్రముఖ సినీ నిర్మాత బెల్లంకొండ సురేశ్‌(Bellamkonda Suresh)పై ఫిలింనగర్‌ పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్‌ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. ఫిలింనగర్‌ రోడ్‌ నెంబర్‌–7లో శివప్రసాద్‌ అనే వ్యక్తికి ఇల్లు ఉండగా కొంతకాలంగా ఆయన ఇంటికి తాళం వేసి తన బంధువుల వద్దకు వెళ్లాడు. మూడు రోజుల క్రితం బెల్లంకొండ సురేష్‌తో పాటు ఆయన అనుచరులు శివప్రసాద్‌ ఇంటికి వచ్చి తాళాలు పగులగొట్టి ఇంట్లో ఆస్తులు ధ్వంసం చేసి గోడలు పగులగొట్టి నానా బీభత్సం సృష్టించారు.

 ఇంటిని ఆక్రమించుకునేందుకు యత్నించారు. విషయం తెలుసుకున్న శివప్రసాద్‌ ఇంటికి వచ్చి చూడగా అప్పటికే ఇల్లంతా పూర్తిగా దెబ్బతిని ఉంది. వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. బెల్లంకొండ సురేష్‌ 30 మంది అనుచరులతో వచ్చి తన ఇంటిని ధ్వంసం చేశాడని తెలుసుకున్న బాధితుడు తన సిబ్బందిని బెల్లంకొండ సురేష్‌ ఇంటికి పంపించాడు. ఆగ్రహంతో ఊగిపోయిన సురేష్‌ సిబ్బందిపై అసభ్యకరంగా ప్రవర్తిస్తూ దూషణలతో న్యూసెన్స్‌ చేశాడు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఫిలింనగర్‌ పోలీసులు బెల్లంకొండ సురేశ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)