Breaking News

ఒక డైమండ్‌ కోసం జరిగే అన్వేషణే ‘పింకీ’

Published on Thu, 01/04/2024 - 17:33

కిర‌ణ్‌, మౌర్యాణి జంట‌గా  నటించిన తాజా చిత్రం ‘పింకీ’. సీర‌పు ర‌వి కుమార్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న ఈ చిత్రంలో సుమ‌న్ , శుభ‌లేఖ సుధాక‌ర్, ర‌వి అట్లూరి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. విఆర్ పి క్రియేష‌న్స్ ప‌తాకంపై పి.ప‌ద్మావ‌తి స‌మ‌ర్ప‌ణ‌లో ప‌సుపులేటి వెంక‌ట ర‌మ‌ణ నిర్మిస్తోన్న ఈ చిత్రం అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని ఫిబ్ర‌వ‌రి మొద‌టి వారంలో గ్రాండ్ గా విడ‌దుల‌కు సిద్ద‌మ‌వుతోంది.

ఈ సంద‌ర్భంగా ఈ రోజు హైదరాబాద్‌లోని ఫిలించాంబ‌ర్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో నిర్మాత తుమ్మ‌ల‌ప‌ల్లి రామ స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ..`జ‌నం, జ‌రిగిన క‌థ చిత్రాలు చేసిన ద‌ర్శ‌క నిర్మాత ప‌సుపులేటి వెంక‌ట ర‌మ‌ణ గారు. ఆయ‌న ద‌ర్శ‌కుడు అయ్యుండి మ‌రో ద‌ర్శ‌కుడికి అవ‌కాశం ఇవ్వ‌డం గొప్ప విష‌యం. త‌న  నిర్మాణంలో వ‌స్తోన్న ఈ పింకీ చిత్రం ఘ‌న విజ‌యం సాధించాల‌ని కోరుకుంటున్నా` అన్నారు.

హీరో కిర‌ణ్ మాట్లాడుతూ...`నాకు ఈ చిత్రంలో హీరోగా అవ‌కాశం క‌ల్పించిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు నా ధ‌న్య‌వాదాలు. దర్శ‌కుడు అద్భుతంగా తెర‌కెక్కించారు సినిమా. ఈ సినిమా విడుద‌ల‌కోసం ఆతృత‌గా ఎదురు  చూస్తున్నా` అన్నారు.

ద‌ర్శ‌కుడు సీర‌పు ర‌వి కుమార్ మాట్లాడుతూ...`ఇది నా మొద‌టి సినిమా. నిర్మాత ఎక్క‌డా రాజీ పడ‌కుండా సినిమా బాగా రావ‌డానికి స‌హ‌క‌రించారు.  ఒక డైమండ్ కోసం జ‌రిగే అన్వేష‌ణే ఈ చిత్రం. ఫ్యామిలీ అండ్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్` అన్నారు.

నిర్మాత ప‌సుపులేటి వెంక‌ట ర‌మ‌ణ మాట్లాడుతూ..`సీర‌పు ర‌వి కుమార్  చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో `పింకీ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నా. ఇప్ప‌టికే షూటింగ్ పూర్త‌యింది. సెన్సార్ ప‌నులు జ‌రుగుతున్నాయి.  ఫిబ్ర‌వ‌రి మొద‌టి వారంలో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం. ద‌ర్శ‌కుడు అన్నీ తానై ఈ చిత్రాన్ని రూపొందించాడు`అన్నారు.

ప్రొడ్యూస‌ర్ కౌన్సిల్ సెక్ర‌ట‌రీ ప్ర‌స‌న్న కుమార్ మాట్లాడుతూ...`` పింకీ టైటిల్ తో వివిధ భాషల్లోవ‌చ్చిన చిత్రాలన్నీ ఘ‌న విజ‌యం సాధించాయి. ఎన్నో అవార్డ్స్ అందుకున్నాయి. అలాంటి క్యాచీ టైటిల్ తో వ‌స్తోన్న ఈ చిత్రం కూడా మంచి స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నాను’అన్నారు. 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)