Breaking News

పాయల్‌ రాజ్‌పుత్‌ సెన్సేషనల్‌ ఫస్ట్‌ లుక్‌

Published on Tue, 04/25/2023 - 11:49

'ఆర్ఎక్స్ 100' ఫేమ్‌ అజయ్‌ భూపతి దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘మంగళవారం’.  పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్ర పోషిస్తోంది.  స్వాతి గునుపాటి, సురేష్ వర్మలలతో కలిసి అజయ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి పాయల్‌ ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు మేకర్స్‌. 'మంగళవారం' సినిమాలో శైలజ పాత్రలో పాయల్ రాజ్‌పుత్ నటిస్తున్నట్లు ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా తెలిపారు.

ఆ లుక్ చూస్తే... పాయల్ కళ్ళల్లో కన్నీటి పొర కనబడుతోంది. ఆమె వేలిపై సీతాకోక చిలుక ఉంది. జడలో మల్లెపూలు ఉన్నాయి. అయితే, ఒంటి మీద ఒక్క నూలుపోగు కూడా లేదు. వెనుక నుంచి ఫోటో తీశారు. ఇదొక ఎమోషనల్ అండ్ బోల్డ్ లుక్ అని చెప్పవచ్చు. ప్రస్తుతం పాయల్‌ లుక్‌ నెట్టింట్‌ వైలర్‌ అవుతోంది. 

(చదవండి: రాహుల్‌ రామకృష్ణ కొడుకుని చూశారా? పేరు భలేగా ఉందే?)

ఈ సినిమా గురించి అజయ్‌ మాట్లాడుతూ.. 'గ్రామీణ నేపథ్యంలో 1990వ దశకంలో సాగే కథతో తీస్తున్న చిత్రమిది. మన నేటివిటీతో కూడిన డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్. రా అండ్ రస్టిక్ గా ఉంటుంది. థియేటర్ల నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ప్రేక్షకులకు గుర్తు ఉండేలా పాయల్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది. ఇప్పటి వరకు ఇండియాలో ఎవరూ ప్రయత్నించనటువంటి కొత్త జానర్ సినిమా. సినిమాలో 30 పాత్రలు ఉన్నాయి. ప్రతి పాత్రకూ కథలో ప్రాముఖ్యం ఉంటుంది' అని అన్నారు. ‘ 'ఆర్ఎక్స్ 100'లో ఇందు పాత్ర ప్రేక్షకులకు ఎలా గుర్తు ఉండిపోతుందో, ఇప్పుడీ 'మంగళవారం'లో శైలజ పాత్ర కూడా అలాగే గుర్తు ఉంటుంది’ అన్నారు నిర్మాతలు స్వాతి గునుపాటి, సురేశ్‌ వర్మ.  ఈ చిత్రానికి ‘కాంతార’ఫేమ్‌ అజనీష్‌ లోక్‌నాథ్‌ సంగీతం అందిస్తున్నారు. 

Videos

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)