Breaking News

‘వెంక‌ట‌ల‌చ్చిమి’గా అలరించబోతున్న పాయల్‌

Published on Fri, 01/24/2025 - 15:48

‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో యూత్ గుండెల్లో సెగ‌లురేపి, ‘మంగ‌ళ‌వారం’ మూవీతో మ‌న‌సు దోచుకున్న బ్యూటీ పాయల్ రాజ్‌పుత్(Payal Rajput).. ఈ సారి పాన్ ఇండియా సినిమాతో రాబోతోంది. 6 భాష‌ల్లో  ‘వెంక‌ట‌ల‌చ్చిమి’(Venkatalachimi Movie)గా ఎంట్రీ ఇవ్వ‌బోతోంది. రాజా, ఎన్ఎస్ చౌదరి నిర్మాత‌లుగా, డైరెక్ట‌ర్ ముని ద‌ర్శ‌క‌త్వంలో  పాయల్ రాజ్‌పుత్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్క‌నున్న ‘వెంక‌ట‌ల‌చ్చిమి’ మూవీ హైద‌రాబాద్ రామానాయుడు స్టూడియోలో పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది.

ఈ సంద‌ర్బంగా డైరెక్ట‌ర్ ముని మాట్లాడుతూ.. ‘‘వెంక‌ట‌ల‌చ్చిమి’గా క‌థ అనుకున్న‌ప్పుడే పాయల్ రాజ్‌పుత్ స‌రిగ్గా స‌రిపోతార‌నిపించింది. పాన్ ఇండియా సినిమాగా తెలుగుతో పాటు హిందీ, పంజాబీ, కన్నడ, మలయాళం, తమిళం భాషల్లో తెర‌కెక్కిస్తున్నాం. ట్రైబల్ గర్ల్  యాక్షన్ రివైంజ్ స్టోరీతో కూడిన‌ ఈ రివేంజ్ డ్రామా ఇండియ‌న్ ఇండ‌స్ట్రీలో సంచ‌ల‌నం సృష్టించ‌డం ఖాయం’’ అని అన్నారు.

హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ మాట్లాడుతూ.. ‘‘మంగ‌ళ‌వారం’ సినిమా త‌ర్వాత ఎన్నో క‌థ‌లు విన్నాను. న‌చ్చ‌క‌ రిజెక్ట్ చేశాను. డైరెక్ట‌ర్ ముని గారు ‘వెంక‌ట‌ల‌చ్చిమి’ క‌థ చెప్ప‌గానే చాలా న‌చ్చేసింది. ఈ సినిమా త‌ర్వాత నా పేరు ‘వెంక‌ట‌ల‌చ్చిమి’గా స్థిర‌ప‌డిపోతుందేమో అన్నంత‌గా బ‌ల‌మైన స‌బ్జెక్టు ఇది. నా కెరీర్‌కి నెక్ట్స్ లెవ‌ల్‌గా ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ నిలిచిపోతుంద‌నే న‌మ్మ‌కం ఉంది.’’ అని అన్నారు.
యూత్ ఆడియ‌న్స్‌కు హాట్ ఫేవ‌రేట్ హీరోయిన్‌గా మారిపోయింది పాయల్ రాజ్‌పుత్. ఈసారి డిఫరెంట్ కాన్సెప్టు, ఛాలెంజింగ్ రోల్‌తో ఈ పాన్ ఇండియా సినిమా చేయ‌డం ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి