Breaking News

'హరి హర వీరమల్లు'కు పవన్‌ రెమ్యునరేషన్‌

Published on Thu, 07/24/2025 - 12:25

పవన్‌ కల్యాణ్‌ నటించిన హరి హర వీరమల్లు సినిమా జులై 24న థియేటర్స్‌లోకి వచ్చేసింది. క్రిష్, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ అంచనాలతో విడుదలైంది. అయితే, చాల పేలమైన కథ, మేకింగ్‌ విలువల వల్ల మొదటి ఆటతోనే డిజాస్టర్‌గా నిలిచిందని సోషల్‌మీడియాలో ట్రెండ్‌ అవుతుంది. సుమారు. 250 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఏంతమేరకు కలెక్షన్స్‌ రాబడుతుందో తెలియాల్సి ఉంది. అయితే, ఈ సినిమాకు పవన్‌ కల్యాణ్‌ రెమ్యునరేషన్‌ ఎంత అనేది ఆయన చెప్పారు.

పవన్ కల్యాణ్‌ తన మునుపటి చిత్రం 'బ్రో' కోసం తీసుకున్న రెమ్యునరేషన్‌ రూ. 50 కోట్లు అంటూ ఇండస్ట్రీలో టాక్‌ ఉంది. అయితే, హరి హర వీరమల్లు చిత్రం కోసం ఆయన రూ. 20 కోట్ల లోపే తీసుకున్నారని తెలుస్తోంది. అయితే, ఆ సినిమా విడుదలైన తర్వాత వచ్చే ఆదాయాన్ని బట్టి  తన పారితోషికాన్ని పరిగణనలోకి తీసుకుంటానని ఇంటర్వ్యూలో పవన్‌ అన్నారు. 

కానీ, తాజాగా అందుతున్న మరో సమాచారం ప్రకారం.. రెమ్యునరేషన్‌తో పాటు సినిమా రన్‌ పూర్తి అయ్యాక నిర్మాతకు వచ్చే లాభాలను బట్టి మిగతా రెమ్యూనరేషన్ ఉంటుందని సమాచారం. అంటే సినిమాకు వచ్చే రెవెన్యూలో ఆయనకు షేర్‌ ఉంటుందని ముందే ఒక డీల్‌ ఉందట. అందుకే ప్రీమియర్‌ షోలు, టికెట్‌ ధరల పెంపు వంటి అంశాలపై పవన్‌ ఎక్కువ శ్రద్ధ పెట్టారని అంటున్నారు. ఈ సినిమా కోసం ఏకంగా ఆయన రెండు రోజుల పాటు హైదరాబాద్‌, విశాఖపట్నంలో మీడియా సమావేశాలు నిర్వహించారు. ఇదంతా సొమ్ము చేసుకునే పనిలో భాగమేనని నెట్టింట టాక్‌.  ఇందులో హీరోయిన్‌గా నటించిన నిధి అగర్వాల్‌ మాత్రం ఈ ప్రాజెక్ట్‌ కోసం రూ. 2.5 కోట్ల వరకు తీసుకున్నట్లు ఇండస్ట్రీలో చెబుతున్నమాట.

Videos

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)