Breaking News

‘మా’ ఆధ్వర్యంలో పావలా శ్యామల అంత్యక్రియలు

Published on Tue, 07/28/2026 - 10:54

సీనియర్‌  నటి పావలా శ్యామల అంత్యక్రియల బాధ్యతను మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) తీసుకుంది. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నఆమె ఈ రోజు(జులై 28)  హైదరాబాద్‌లోని ఉస్మానియా హాస్పిటల్‌లో తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం ఆమె భౌతికకాయాన్ని ఆసుపత్రి సిబ్బంది మార్చురీలో భద్రపరిచారు. 

పావలా శ్యామల గారి కుమార్తె కూడా ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండటంతో, అంత్యక్రియల నిర్వహణకు 'మా' (MAA) ముందుకు వచ్చింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పూర్తి సొంత ఖర్చులతో ఈ అంత్యక్రియలను నిర్వహించనుండగా, ప్రముఖ నటి కరాటే కళ్యాణి  ఈ అంతిమ సంస్కారాల పూర్తి బాధ్యతలను దగ్గరుండి చూసుకోనున్నట్లు తెలిపారు.

కాగా.. పలు టాలీవుడ్‌ చిత్రాల్లో తన నటనతో ఆకట్టుకున్న శ్యామల.. చివరి రోజుల్లో  దీన స్థితిని గడిపారు. చికిత్సకు డబ్బుల్లేక ఎన్నో అవస్థలు పడ్డారు. పావలా శ్యామల గత కొన్నేళ్లుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు, వృద్ధాప్య సమస్యలతో జీవన పోరాటం సాగించి.. ఈ రోజు కన్నుమూశారు. ఆమె కుమార్తె కూడా ప్రస్తుతం తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)