Breaking News

చిన్నప్పుడే లైంగిక వేధింపులు.. లిఫ్ట్‌లో అలా ప్రవర్తించాడు : హీరోయిన్‌

Published on Sat, 01/10/2026 - 19:27

దురదృష్టవశాత్తు, ఈ ప్రపంచంలోని ప్రతి మహిళ తన జీవితంలో కనీసం ఒక్కసారైనా లైంగిక వేధింపులకు గురవుతుంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి మహిళకు ఈ వేధింపుల తప్పడం లేదు. తాజాగా మలయాళ స్టార్‌ నటి పార్వతి తిరువోత్‌ తన జీవితంలో ఎదురైన లైంగిక వేధింపుల అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. చిన్నప్పటి నుంచి పలు ఘటనలు ఆమెను మానసికంగా కలచివేశాయని చెప్పుకొచ్చారు.

ఛాతీపై కొట్టాడు.. 
నా చిన్నప్పుడు ఒకసారి అమ్మా నాన్నలతో కలిసి రైల్వే స్టేషల్‌కు వెళ్లాను. ట్రైన్‌ కోసం పెరెంట్స్‌తో కలిసి నిలబడితే.. ఒకడు వచ్చి నా ఛాతీపై కొట్టి పారిపోయాడు. అతను కావాలనే అక్కడ టచ్‌ చేశాడు. ఆ సంఘటన నన్ను చాలా మానసిక క్షోభకు గురిచేసింది. ఆ తర్వాత నేను బయటకు వెళ్తే.. ఎలా ఉండాలో అమ్మ చెప్పేది. మగాళ్ల చేతులను చూస్తూ నడవాలని చెప్పాలి. ఒక తల్లి తన కూతురికి ఇలా నేర్పించాల్సిన పరిస్థితి రావడం దారుణం. ఆ ఒక్క సంఘటననే కాదు. చిన్నప్పుడు నాకు ఇలాంటివి చాలానే ఎదురయ్యాయి. కొంతమంది మగాళ్లు ప్రైవేట్‌ పార్ట్‌ని చూపిస్తూ.. అసభ్యకరంగా మాట్లాడిన సంఘటనలు కూడా ఉన్నాయి. స్కూల్‌లో ఉన్నప్పుడు ఒకరిని ప్రేమించా. అతను నన్ను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి కోరిక తీర్చమని వేధించాడు. ప్రేమిస్తే.. అనుమతి లేకపోయినా సరే ఆ పనికి ఒప్పుకోవాల్సిందేనా?

లిఫ్ట్‌లో అలా.. కొట్టేశా
19-20 ఏళ్ల వయసులో కూడా ఓ ఘటన జరిగింది. సినిమా కోసం స్నేహితులతో కలిసి మాల్‌కి వెళ్లాను. అనంతరం లిఫ్ట్‌లో కిందికి వస్తుంటే..ఒక వ్యక్తి నా దగ్గరికి రావడానికి ప్రయత్నించాడు. అతని ప్రైవేట్‌ పార్ట్‌ నాకు తగిలినట్లుగా అనిపించింది. లిఫ్ట్‌ దిగగానే అతన్ని చెంపపై కొట్టాను. సెక్యూరిటీ వచ్చి ఆపారు. పోలీసులకు ఫోన్‌ చేసి రప్పించాను. చివరికి అతను నా కాళ్ళ మీద పడి, 'నాకు ఇప్పుడే గల్ఫ్‌లో ఉద్యోగం వచ్చింది, నేను పెళ్లి చేసుకుంటున్నాను' అనడంతో వదిలేశా.  నేను అతన్ని కొట్టినప్పుడు, అందరూ నన్ను అభినందించారు. కానీ అది పెద్ద విజయం అని నేను అనుకోలేదు. నన్ను నేను రక్షించుకోవడం పెద్ద విషయం కాదు’ అని పార్వతి చెప్పుకొచ్చింది. 

సినిమాలో విష‌యానికి వ‌స్తే.. 2024లో వచ్చిన ‘ఉల్లోజుక్కు’ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న పార్వతీ, ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉంది. నాగచైతన్య నటించిన ‘దూత’ వెబ్ సిరీస్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)