Breaking News

‘రంగమార్తాండ’ క్లైమాక్స్ అలా ఉండి ఉంటే మరింత బాగుండేది

Published on Tue, 04/18/2023 - 12:46

పరుచూరి గోపాలకృష్ణ తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. కొత్త సినిమాలపై ఎప్పటికప్పుడు తన రివ్యూలను అభిమానులతో పంచుకుంటారు. ఇటీవలే విడుదలైన సూపర్‌ హిట్‌ టాక్‌ అందుకున్న 'రంగమార్తాండ' చిత్రంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రమ్యకృష్ణ, ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక, ‍అనసూయ ప్రధానపాత్రల్లో నటించారు. 

పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ..'సినిమా గురించి నేను ఎక్కువ చెప్పడం లేదు. ఈ సినిమాలో జీవితం గురించి ఉంది కాబట్టి చెబుతున్నా. ప్రస్తుత సమాజంలో ఎక్కడైనా ఏదైనా జరుగుతూ ఉంటే చూసి కూడా ఎవరూ పట్టించుకోవట్లేదు. ఒక అమ్మాయిని చంపుతుంటే ఎవరు పట్టించుకోకుండా వీడియోలు తీసే సీన్‌తోనే సినిమా ప్రారంభమైంది. ప్రపంచంలో మిమ్మల్ని ఎవరూ పట్టించుకోరు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పారు. ప్రకాశ్‌రాజ్‌, రమ్యకృష్ణ, రాహుల్‌, అనసూయ, శివాత్మిక, ఆదర్శ్‌ అద్భుతంగా నటించారు. శివాత్మిక పాత్ర అద్దం పట్టేలా ఉంటుంది. ఒక కూతురు తన తండ్రిని సెల్లార్‌లో పడుకోమని చెప్పినప్పుడు ప్రేక్షకులకు తప్పకుండా కన్నీళ్లు వచ్చేస్తాయి. ఈ సినిమాలో బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పాలి. బ్రహ్మానందం అంటే నవ్విస్తాడనుకుంటాం. కానీ ఆయన ఏడిపించగలడని ఈ సినిమాలో నిరూపించారు. 

మన అమ్మా, నాన్నలను మించినది ఏది లేదు. మనకు ఏది రాదు కూడా. అందుకే వారిని పదిలంగా చూసుకుందాం. ఈ సినిమా చూశాక ఎవరైనా తమ అమ్మా, నాన్న దగ్గరకు వెళ్లి ఉంటే కృష్ణవంశీ జన్మ ధన్యమైనట్లే. కళాభారతిని చూసి రాఘవరావు అంటే ప్రకాశ్ రాజ్ కన్న మూయడం. పిల్లలందరూ వచ్చి చూడడంతో క్లైమాక్స్‌ చూపించారు.  కళాభారతిని పునర్‌ నిర్మాణం చేయించి.. రాఘవరావు సౌజన్యంతో అని పెట్టి క్లైమాక్స్ సీన్‌ తీసి ఉంటే ఇంకా బాగుండేది. ఈ విషయాన్ని కృష్ణవంశీతో చెప్పా. కానీ ఒరిజినల్‌ కథలో అలా లేదు. అందుకే పెట్టలేదన్నారు. ప్రకాశ్‌రాజ్‌కు, బ్రహ్మనందానికి మధ్య ఉండే సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయి. అంతే కాకుండా ప్రకాశ్‌రాజ్‌, బ్రహ్మానందం నటనా ప్రావీణ్యాన్ని తెలిసేలా ఇంకొన్ని షాట్స్‌ పెట్టి ఉంటే మరిన్ని వసూళ్లు రాబట్టేది. కన్నీళ్లు రావు అనుకున్న వాళ్లకు కూడా కన్నీళ్లు తెప్పించే సినిమా ఇది.' అని పరుచూరి వివరించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)