Breaking News

అందరికీ ఉ‍న్న సమస్యే.. ఏకంగా సినిమా తీసేశారు!

Published on Sun, 11/26/2023 - 16:45

'జెర‍్సీ' ఫేమ్ హరీష్‌ కళ్యాణ్‌ హీరోగా నటించిన సినిమా 'పార్కింగ్'. ఇందూజ హీరోయిన్. రామ్‌ కుమార్‌ బాలకృష్ణన్‌ దర్శకత్వం వహించారు. ఫ్యాషన్‌ స్టూడియోస్‌, సోల్జర్స్‌ ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకుని డిసెంబర్‌ 1న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా శుక్రవారం ప్రీ రిలీజ్‌ ఈవెంట్ చైన్నెలోని ప్రసాద్‌ ల్యాబ్‌లో నిర్వహించారు. 

(ఇదీ చదవండి: Bigg Boss 7: అశ్విని ఎలిమినేట్.. ఏడు వారాలకు రెమ్యునరేషన్ ఎంత తెలుసా?)

ఈ కార్యక్రమంలో దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌, అరుణ్‌ రాజ్‌ కామరాజా, రవికుమార్‌, రతన్‌ కుమార్‌, రంజిత్‌ జయకొడి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఇక హీరో హరీష్ కల్యాణ్ మాట్లాడుతూ.. చిత్ర జయాపజయాలు ప్రేక్షకుల చేతుల్లోనే ఉంటాయని, 'పార్కింగ్‌' లాంటి మంచి కథని వదులుకుంటే కచ్చితంగా తాను బాధపడేవాడినని చెప్పుకొచ్చాడు. లోకేష్‌ మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని తాను ఇంతకుముందే చూశానని, పార్కింగ్‌ అనే పేరుతో ఒక పెద్ద సమస్యను ఈ చిత్రంలో చూపించారని దర్శకుడిని అభినందించారు. చిత్రంలో అందరూ చాలా బాగా నటించారని పేర్కొన్నారు.

కథేంటి?
ట్రైలర్ బట్టి చూస్తే.. సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసే హీరో. ఓ ఇం‍ట్లో అద్దెకు ఉంటాడు. పెళ్లయిన తర్వాత కొత్త కారు కొంటాడు. ‍అయితే ఉంటున్న ఇం‍ట్లో పార్కింగ్ సమస్య వస్తుంది. ఓనర్-హీరో ఒకరినొకరు రక్తాలొచ్చేలా కొట్టుకునేంతవరకు వెళ్తుంది. పోలీస్ కేసుల వరకు వెళ్తారు. మరి ఈ పార్కింగ్ సమస్యని ఎలా పరిష్కరించారు? చివరకు ఏమైందనేదే సినిమా స్టోరీ.

(ఇదీ చదవండి: Bigg Boss 7: రైతుబిడ్డ వల్ల రెండోసారి రతిక ఎలిమినేట్.. వేరే లెవల్ రివేంజ్!)\

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)