Breaking News

36 రోజుల్లో పూర్తయిన సినిమా.. రిలీజ్ ఎప్పుడంటే?

Published on Thu, 11/16/2023 - 12:26

వైవిధ్యభరిత కథా చిత్రాలను ఎంపిక చేసుకుని నటిస్తున్న యువనటుడు హరీష్‌కల్యాణ్‌. ఈయన ఇటీవల ఎల్‌జీఎం చిత్రంతో ప్రేక్షకులను అలరించి తాజాగా పార్కింగ్‌తో తెరపైకి రావడానికి సిద్ధం అవుతున్నారు. నటి ఇందుజా నాయకిగా నటించిన ఇందులో ఎంఎస్‌.భాస్కర్‌, రమా, ఇళవరసు, ప్రార్థన ముఖ్యపాత్రలు పోషించారు. రామ్‌కుమార్‌ బాలకృష్ణన్‌ అనే నవ దర్శకుడిని పరిచయం చేస్తూ ఫ్యాషన్‌ స్టూడియోస్‌, సోల్జర్స్‌ ఫ్యాక్టరీ సంస్థలు నిర్మించిన చిత్రం ఇది. శామ్‌.సీఎస్‌ సంగీతాన్ని, జిజు సన్ని ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తిచేసుకుని డిసెంబర్‌ ఒకటో తేదీన విడుదలకు సిద్ధమఅవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ చైన్నెలో సమావేశం ఏర్పాటు చేసింది. 

లాక్‌డౌన్‌ సమయంలో జరిగిన సంఘటనలను ఆధారంగా చేసుకుని రాసుకున్న కథతో తెరకెక్కించిన చిత్రమే పార్కింగ్‌ అని దర్శకుడు రామ్‌కుమార్‌ బాలకృష్ణన్‌ చెప్పారు. ఆ సమయంలో జరిగిన పలు సంఘటనలు ఈ చిత్రంలో చోటుచేసుకుంటాయన్నారు. ఇప్పుడు ప్రతి వ్యక్తి ఎప్పుడో, ఎక్కడో ఎదుర్కొనే సంఘటనలే  నేపథ్యమని పేర్కొన్నారు. ముఖ్యంగా ఈగో అనే అంశాన్ని ఇతివృత్తంగా తీసుకుని పార్కింగ్‌ చిత్రాన్ని రూపొందించినట్లు చెప్పారు.

ఇందులో హరీష్‌ కల్యాణ్‌ ఒక ఐటీ కంపెనీలో ఉద్యోగిగానూ.. ఆయనకు భార్యగా ఇందుజా నటించారని తెలిపారు. మరో ముఖ్యపాత్రలో నటుడు ఎంఎస్‌.భాస్కర్‌ నటించారని తెలిపారు. చిత్రంలో రెండు పాటలు ఉంటాయని చెప్పారు. ప్రీ ప్రొడక్షన్స్‌కు అధిక సమయం కేటాయించి షూటింగ్‌ను చైన్నె పరిసర ప్రాంతాల్లో 36 రోజుల్లో పూర్తిచేసినట్లు తెలిపారు. మానవతావాదం ముఖ్యం అని చెప్పే చిత్రంగా పార్కింగ్‌ ఉంటుందని దర్శకుడు తెలిపారు. తనకు కథను చెప్పిన దానికంటే బెటర్‌గా దర్శకుడు ఈ చిత్రాన్ని తెరపై ఆవిష్కరించారని నటుడు హరీశ్‌కల్యాణ్‌ పేర్కొన్నారు.

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?