Breaking News

చెట్టుకు, మనిషికి మధ్య ఉండే ప్రేమకథతో ‘గాంధీ తాత చెట్టు’

Published on Tue, 01/21/2025 - 02:55

‘‘గాంధీ తాత చెట్టు’ సినిమా మహాత్మాగాంధీగారి బయోపిక్‌ కాదు. గాంధీ, తాత, చెట్టు.. ఈ మూడింటి కథే ఈ చిత్రం. గాంధీగారి సిద్ధాంతాలు ఉన్న గాంధీ అనే అమ్మాయి అహింసావాదంతో తన ఊరిని, చెట్టును ఎలా కాపాడింది? అనేది కథ. ప్రకృతి, మనుషుల మధ్య అహింస చాలా అవసరం అనే సందేశాన్ని మా సినిమా ద్వారా ఇస్తున్నాం’’ అని డైరెక్టర్‌ పద్మావతి మల్లాది చెప్పారు. 

ప్రముఖ డైరెక్టర్‌ సుకుమార్‌ కుమార్తె సుకృతి వేణి బండ్రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గాంధీ తాత చెట్టు’. తబితా సుకుమార్‌ సమర్పణలో నవీన్  ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, శేష సింధూరావు నిర్మించిన ఈ మూవీ ఈ నెల 24న విడుదలవుతోంది. 

ఈ సందర్భంగా చిత్ర దర్శకురాలు పద్మావతి మల్లాది మాట్లాడుతూ–‘‘నేను హైదరాబాద్‌లో పుట్టి పెరిగాను. పీజీ పూర్తిచేసిన తర్వాత డైరెక్టర్‌ చంద్రశేఖర్‌ యేలేటిగారి దగ్గర రచనా విభాగంలో పనిచేశాను. ‘రాధే శ్యామ్, ‘మహానటి, చూసీ చూడంగానే, అమ్ము’ అనే సినిమాలతో పాటు ‘బృంద’ అనే వెబ్‌ సిరీస్‌కు రచయితగా పని చేశాను. ‘గాంధీ తాత చెట్టు’ విషయానికొస్తే..  చెట్టుకు, మనిషికి మధ్య ఉండే ప్రేమకథతో పాటు మొక్కల గురించి తర్వాతి తరం వాళ్లకు చెప్పాలనే సంకల్పంతో ఈ కథ రాశాను. 

సందేశం, భావోద్వేగాలు, వాణిజ్య అంశాలున్న ఈ సినిమా అందరి హృదయాలకు హత్తుకుంటుంది. సుకృతి వేణి గాంధీ పాత్ర కోసం నిజంగా గుండు చేయించుకుంది. ఈ సినిమాకు రీ అందించిన సంగీతం, నేపథ్య సంగీతానికి చాలా ప్రాధాన్యత ఉంది’’ అని పేర్కొన్నారు.

#

Tags : 1

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)