Breaking News

ఆ విషయంలో మన తెలుగు హీరోలు మారాలి! 

Published on Thu, 04/13/2023 - 03:20

♦ ‘రుద్రమదేవి’ తర్వాత  ‘హిరణ్య కశ్యప’ సినిమా స్క్రిప్‌్ట, ప్రీ ప్రొడక్షన్‌పై ఐదేళ్లు వర్క్‌ చేశాను. షూటింగ్‌ ఆరంభించే టైమ్‌లో కోవిడ్‌ వచ్చింది. దీంతో అప్పుడు మాతో కలిసి ఉన్న ఓ హాలీవుడ్‌ సంస్థ మరో వర్క్‌పై ఫోకస్‌ పెట్టింది. ఈ కారణంగా ఆ ప్రాజెక్ట్‌ను హోల్డ్‌లో పెట్టాం.   

♦లాక్‌డౌన్‌ టైమ్‌లో కొన్ని పురాణాలు, ఇతిహాసాల కలయికలో ఓ ప్రేమకథ చేద్దామనే ఆలోచన వచ్చింది. ఆ క్రమంలో కాళిదాసు ‘అభిజ్ఞాన శాకుంతలం’ నాకు నచ్చింది. దాన్ని సోషలైజ్‌  చేయటమెందుకు.. అలాగే తీస్తే బెటర్‌ కదా అని ‘శాకుంతలం’ మొదలుపెట్టాను. సాధారణంగా శకుంతల అనగానే శృంగార శకుంతల గుర్తుకొచ్చేలా ఇప్పటివరకూ చూపించారు. కానీ, ఆమెలో అంతర్గతంగా చాలా శక్తి, ఆత్మాభిమానం ఉంటుందని ‘అభిజ్ఞాన శాకుంతలం’లో  కాళిదాసు ప్రస్తావించారు. నేను కూడా శకుంతల లోని రెండో కోణంతో కథ అల్లుకుని, ‘శాకుంతలం’ తీశాను.   

♦ తన ఆత్మాభిమానం కోసం అప్పట్లో రాజు, రాజ్యాలను శకుంతల లెక్క చేయకుండా పోరాడి నిలబడింది. పెళ్లి కాకుండా తల్లి కావటం అనేది అప్పట్లో పెద్ద నేరం. అలాంటి పరిస్థితులను ఆమె ఎలా ఎదురొడ్డి నిలబడిందనేది ఈ చిత్రకథాంశం.

♦ సమంత చాలా మంచి నటి. అందుకే శకుంతల పాత్రలో రొమాంటిక్‌ యాంగిల్‌ను సెకండ్రీ చేశా. నటనకు ప్రాధాన్యం ఉండేలా చూపించాను. నేను, అరుణ బిక్షుగారు, సమంతగారు కలిసి మాట్లాడుకుని శకుంతల పాత్రను డిజైన్‌ చేశాం. సమంత కొత్త హీరోయిన్‌లా అరుణ బిక్షుగారి వద్ద శిక్షణ తీసుకుని నటించింది.

♦ ‘శాకుంతలం’లో దుర్వాస మహామునిగా మోహన్‌బాబుగారు నటించారు. ఆ పాత్రని ఆయన తప్ప మరొకరు చేయలేరు. ఆయన ఒప్పుకోకుంటే ఈ ప్రాజెక్ట్‌ గురించి నేను ఆలోచనలో పడేవాణ్ణి. 

♦ అమితాబ్‌ బచ్చన్, సల్మాన్‌ ఖాన్, షారుక్‌ ఖాన్‌.. ఇలా బాలీవుడ్‌ స్టార్‌ హీరోలు అతిథి పాత్రలు చేస్తున్నారు. ఆ విషయంలో మన తెలుగు హీరోలు మారాలి. ‘రుద్రమదేవి’లో అల్లు అర్జున్‌ది అతిథి పాత్ర అయినా అద్భుతమైన స్పందన వచ్చింది. ‘శాకుంతలం’లో దుష్యంతుడి పాత్రలో చాలా కోణాలుంటాయి. ఆ పాత్రని తెలుగు హీరోలు చేస్తారనే నమ్మకం నాకు కలగలేదు. అడిగి లేదనిపించుకోవటం ఇష్టం లేక వారిని సంప్రదించలేదు. దేవ్‌ మోహన్‌ ‘శాకుంతలం’ పూర్తయ్యే వరకు మరో సినిమా చేయనన్నాడు. అతనికి శిక్షణ ఇప్పించి దుష్యంతుడి పాత్ర చేయించుకున్నాను.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)