Breaking News

ఎమోషనల్‌ స్టోరీ మామన్‌ మూవీ రివ్యూ

Published on Sat, 08/23/2025 - 10:14

మన జీవితంలో మనల్ని బాగా ఇష్టపడేవాళ్ళు ఉంటారు, అలాగే ద్వేషించే వాళ్ళు కూడా ఉంటారు. సాధారణంగా మనల్ని ద్వేషించే వారికి దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తాం. అదే మనల్ని ఇష్టపడేవాళ్ళకు దగ్గరగా ఉండాలనుకుంటాం. అయితే అదే ఇష్టం ఎక్కువై, ఆ ఇష్టం మనకి కష్టం తెచ్చిపెడితే ఎలా ఉంటుంది? అన్న సున్నితమైన పాయింట్‌తో తీసిన ఓ భావోద్వేగంతో కూడిన అద్భుతమైన కుటుంబ కథా చిత్రం ‘మామన్‌’. 

ఓటీటీలో సూపర్‌ హిట్‌ మూవీ
ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ జీ5 వేదికగా స్ట్రీమ్‌ అవుతున్న ఈ తమిళ సినిమా తెలుగులోనూ లభ్యమవుతోంది. ప్రశాంత్‌ పాండ్యరాజన్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ చిన్న సినిమా బాక్సాఫీస్‌ సూపర్‌ హిట్‌. అలా అని దీంట్లో పెద్ద స్టార్, గ్లామర్‌ యాక్షన్‌ ఇటువంటివి ఏమీ లేకపోయినా సినిమా చూస్తున్నంతసేపు సీటులోంచి కదలలేరు. అంతలా కట్టిపడేస్తుంది. ప్రముఖ తమిళ కమెడియన్‌ సూరి కథానాయకుడిగా ఈ సినిమాలో నటించి, మెప్పించారు. ఇంకా చెప్పాలంటే సినిమా చూసే ప్రేక్షకుల మనస్సులను కదిలించారు. అంతలా ఏముందో ఈ సినిమాలో ఓసారి చూద్దాం (Maaman Movie Review). 

కథ
‘మామన్‌’ సినిమా కథ ప్రకారం తమిళనాడులోని తిరుచ్చి ప్రాంతంలో ఇన్బా, గిరిజ అక్కా తమ్ముళ్ళు. ఇన్బాకు అక్కంటే ప్రాణం. అక్కకు పెళ్ళైన చాలా కాలం తరువాత అతి కష్టం మీద ఓ బిడ్డ పుడతాడు. ఆ బిడ్డ పేరు లడ్డూ. అక్క బిడ్డను ఇన్బా అపురూపంగా చూసుకుంటుంటాడు. ఎంతలా అంటే తాను ప్రేమించి పెళ్ళి చేసుకున్న అమ్మాయి రేఖకన్నా లడ్డూ మీదే మమకారం పెంచుకుంటాడు. అయితే అదే సమయంలో ఇన్బా తండ్రి అవుతాడు. ఇక అక్కడి నుండి అసలు సిసలైన కథ మొదలవుతుంది. 

ఎలా ఉందంటే?
అక్క బిడ్డా లేక తనకు పుట్టబోయే బిడ్డా అన్న సంఘర్షణలో కథ ఏ మలుపు తిరుగుతుందో సినిమాలోనే చూడాలి. చాలా సున్నితమైన అంశాన్ని ఎంతో భావుకతతో ప్రేక్షకుడికి ఎక్కడా బోర్‌ కొట్టనీయకుండా చక్కటి స్క్రీన్‌ప్లేతో సినిమాని నడిపిన విధానం నిజంగా అభినందనీయం. ఈ భూమ్మీద భావావేశాలున్న ప్రతి వ్యక్తి తెలుసుకోవాల్సిన అంశం ఈ సినిమాలో ఉంది. సకుటుంబ సపరివార సమేతంగా ఈ సినిమాని చూడవచ్చు, చూసి చాలా నేర్చుకోవచ్చు. ఆఖరుగా ‘మామన్‌’ మామూలు సినిమా అయితే కాదు. మస్ట్‌ వాచ్‌ ఫర్‌ ది వీకెండ్‌.
– హరికృష్ణ ఇంటూరు   

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)