మార్పులు... చేర్పులు

Published on Wed, 04/23/2025 - 02:09

ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం గురించి ఆసక్తికరంగా ఎదురు చూస్తుంటారు. ఈ ఏడాది మార్చి 2న 97వ ఆస్కార్‌ అవార్డుల వేడుక లాస్‌ ఏంజిల్స్‌లో ఘనంగా జరిగింది. కాగా 98వ ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవానికి సంబంధించిన కీలక తేదీలు, కొన్ని కొత్త నియమ–నిబంధనలను అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్స్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌ సంస్థ ప్రకటించింది. 

98వ ఆస్కార్‌ అవార్డుల వేడుక 2026 మార్చి 15 (ఆదివారం)న నిర్వహించనున్నట్లు అకాడమీ ప్రతినిధులు వెల్లడించారు (భారతీయ కాలమానం ప్రకారం మార్చి 16 ఉదయం). ఇంకా ఆస్కార్‌ గవర్నర్‌ అవార్డ్స్‌ ప్రదానోత్సవాన్ని ఈ ఏడాది నవంబరు 16న నిర్వహించనున్నామని, డిసెంబరు 16న షార్ట్‌ లిస్ట్‌ జాబితాను వెల్లడిస్తామని, 2026 జనవరి 22న నామినేషన్స్‌ను ప్రకటిస్తామని అకాడమీ ప్రతినిధులు తెలిపారు. 2026 ఫిబ్రవరి 26న మొదలయ్యే ఫైనల్‌ ఓటింగ్‌ మార్చి 5న ముగుస్తుందని, ‘అచీవ్‌మెంట్‌ ఇన్‌ క్యాస్టింగ్‌’ అనే కొత్త విభాగాన్ని చేర్చామనీ, ఇంకా పలు విషయాలను అకాడమీ ప్రతినిధులు ఈ విధంగా పేర్కొన్నారు.

అన్ని సినిమాలు చూడాల్సిందే! 
ఆస్కార్‌ అవార్డ్స్‌ కోసం ఫైనల్‌ ఓటింగ్‌లో పాల్గొనే సభ్యులు ఏ విభాగానికి అయితే ఓటింగ్‌ చేస్తున్నారో ఆ విభాగంలోని అన్ని చిత్రాలను చూసినట్లుగా అధికారికంగా ధ్రువీకరించేలా ఆస్కార్‌ కమిటీకి ఆధారాలు చూపాలి. అన్ని విభాగాలకు ఓటింగ్‌ చేయాలనుకుంటే, అన్ని విభాగాల్లోని చిత్రాలను ఫైనల్‌ రౌండ్‌లో పాల్గొనే ఆస్కార్‌ ఓటర్స్‌ కచ్చితంగా చూడాలి. ఫైనల్‌ రౌండ్‌లో ఓటింగ్‌ చేసే ఓటర్స్‌ సినిమాలను చూస్తున్నారో? లేదో ఆస్కార్‌ అకాడమీ స్క్రీనింగ్‌ రూమ్‌ ప్రతినిధులు గమనిస్తారు. ఒకవేళ ఓటర్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌ లేదా మరేదైనా సందర్భంలో ఆస్కార్‌ నామినేషన్‌ చిత్రాలను చూసినట్లయితే ఆ ఆధారాలను కమిటీకి అందజేయాలి. ఆస్కార్‌ ఓటర్స్‌ దాదాపు పదివేల మంది ఉన్న విషయం తెలిసిందే. 

ఏఐ చిత్రాలకూ అవార్డ్స్‌ 
‘ఏఐ’ (కృత్రిమ మేధ), డిజిటల్‌ సాధనాలతో రూపోందించబడిన చిత్రాలను కూడా ఆస్కార్‌ అర్హతకు పరిగణిస్తామని, అయితే మానవ నిర్మిత చిత్రాలకుప్రాముఖ్యత ఇస్తామని నిర్వాహకులు పేర్కొన్నారు. 2025లో జనవరి 1 నుంచి డిసెంబరు 30 వరకూ విడుదలైన సినిమాలు ఆస్కార్‌ అవార్డుల కోసం పరిగణిస్తారు. కాకపోతే మ్యూజిక్‌ విభాగంలో మాత్రం ఈసారి నామినేషన్ల సమయాన్ని కాస్త తగ్గించారు.

 ఇక దేశ పౌరుడు ఏ కారాణాల చేతనైనా మరో దేశానికి వలస వెళ్లినా లేదా శరణార్థిగా వెళ్లినా ప్రస్తుతం అతను నివసిస్తున్న దేశం తరఫున ఇంటర్‌నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ కేటగిరీకి అవార్డు కోసం దరఖాస్తు చేయవచ్చు. సినిమాటోగ్రఫీ విభాగంలో గత ఏడాది వరకూ డైరెక్ట్‌గా నామినేషన్స్‌ ప్రకటించేవారు. అయితే తొలిసారిగా షార్ట్‌ లిస్ట్‌ విధానాన్ని తీసుకువచ్చారు. ఇంకా యానిమేటేడ్‌ షార్ట్‌ ఫిల్మ్‌ విభాగంలోనూ చిన్నపాటి మార్పు జరిగింది.  

Videos

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)