Breaking News

వైభవంగా జరగనున్న ఆస్కార్‌ అవార్డు వేడుక

Published on Thu, 03/12/2026 - 02:29

ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎక్కువగా వీక్షించే అవార్డు వేడుకల్లో ‘ఆస్కార్‌’ ముందు వరుసలో ఉంటుంది. ఈ ఏడాది జరగనున్న 98వ ఆస్కార్‌ అవార్డ్స్‌కి ఇంకో వారం రోజులు కూడా లేదు. ఈ నెల 15న (భారతీయ కాలమానం ప్రకారం మార్చి 16) ఆస్కార్‌ అవార్డ్స్‌ ప్రదానోత్సవానికి అకాడమీ అవార్డ్స్‌ సర్వం సిద్ధం చేస్తోంది. ఎప్పటిలానే లాస్‌ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌ ఈ వేడుకకు వేదిక కానుంది. ఆదివారం సాయంత్రం 7 గంటల  ప్రాంతంలో ఆరంభమయ్యే ఈ వేడుకను భారత్‌లో సోమవారం వేకువ జామున 4.30 గంటల నుంచి చూడొచ్చు. స్టార్‌ మూవీస్, జియో హాట్‌స్టార్‌ యాప్‌లో ఈ వేడుక ప్రసారం కానుంది. 

రెడ్‌ కార్పెట్‌ హంగామాతో... 
ఆస్కార్‌ అవార్డు వేడుక అంటే గుర్తొచ్చే వాటిలో రెడ్‌ కార్పెట్‌ పై తారల తళుకులు ఒకటి. అవార్డు వేడుక ఆరంభమయ్యే దాదాపు మూడు గంటల ముందు రెడ్‌ కార్పెట్‌ ఈవెంట్‌ మొదలవుతుంది. బ్రిటిష్‌ ఇంటర్వ్యూ షో ‘చికెన్‌ షాప్‌ డేట్‌’ హోస్ట్‌ అమేలియా డిమోల్డెన్‌బర్గ్‌ వరుసగా మూడోసారి ఈ అవార్డు వేడుకకు సోషల్‌ మీడియా రాయబారి, అధికారిక రెడ్‌ కార్పెట్‌ కరస్పాండెంట్‌గా వ్యవహరించనున్నారు. 

కాగా బుల్లితెర ప్రముఖులు టామ్రాన్‌ హాల్, జెస్సీపామర్‌ రెడ్‌ కార్పెట్‌ షోకు హోస్ట్‌లుగా వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని అవార్డు కమిటీ అధికారికంగా ప్రకటించింది. 2020లో టామ్రాన్‌ హాల్‌ తొలిసారి రెడ్‌ కార్పెట్‌ ఈవెంట్‌కి హోస్ట్‌గా వ్యవహరించగా, ఈ ఏడాది రెండోసారి ఆమె ఈ బాధ్యతను నిర్వర్తించనున్నారు. గత ఏడాదిలానే జెస్సీపామర్‌ ఈసారీ ఈ ఈవెంట్‌ని హోస్ట్‌ చేయనున్నారు. 

మళ్లీ కోనన్‌..: గత ఏడాది ఆస్కార్‌ అవార్డు వేడుకకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన ప్రముఖ హాస్య నటుడు, బుల్లితెర వ్యాఖ్యాత కోనన్‌ ఓబ్రియన్‌ ఈ ఏడాది కూడా తనదైన శైలిలో హోస్ట్‌ చేయడానికి రెడీ అవుతున్నారు. స్వతహాగా హాస్య నటుడు అయిన కోనన్‌ ఆస్కార్‌ వేదికపై కామెడీ చేసి, వీక్షకులను నవ్వించాలని ఫిక్స్‌ అయి΄ోయారు. ‘‘వీక్షకులను నవ్వించాలన్నదే నా లక్ష్యం. అందుకే కొన్నాళ్లుగా కామెడీ క్లబ్‌లకు వెళుతున్నాను.

ఆస్కార్‌ షోలో కావాల్సినంత కామెడీ చేయడానికి ఈ క్లబ్స్‌ కాస్త హెల్ప్‌ అవుతాయి’’ అని కోనన్‌ పేర్కొన్నారు. ఇంకా కోనన్‌ మాట్లాడుతూ – ‘‘నా సీనియర్స్‌ బాబ్‌ హోప్, జానీ కార్సన్‌ హోస్ట్‌గా చేసిన ఆస్కార్‌ అవార్డు వేడుకలను చూస్తూ పెరిగాను. నాకు చరిత్ర గురించి తెలుసుకోవడం ఇష్టం. ఈ నేపథ్యంలోనే ఈ ఇద్దరి షోస్‌ చూశాను. దాదాపు వందేళ్ల చరిత్ర ఉన్న ఆస్కార్‌ అవార్డు వేడుక గురించి నా దగ్గర బోలెడంత సమాచారం ఉంది. కూల్‌గా హోస్ట్‌ చేయడానికి అది నాకు ఉపయోగపడుతుంది. ‘సరదాగా ఉండు అనేది నా వైఖరి’. ఈ షో అలానే ఉంటుంది’’ అని కోనన్‌ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. 

అవార్డులు ప్రదానం చేసేది వీళ్లే: ఈ ఏడాది ఆస్కార్‌ వేదికపై భారతీయ నటి ప్రియాంకా చోప్రాకూడా ఓ ప్రెజెంటర్‌గా వ్యవహరించనున్న విషయం తెలిసిందే. అలాగే హాలీవుడ్‌ స్టార్స్‌ రాబర్ట్‌ డౌనీ జూనియర్, అన్నే హాత్వే, గ్వినెత్‌పాల్ట్రో,పాల్‌ మెస్కల్, క్రిస్‌ ఇవాన్స్, జో సల్డానా తదితరులు విజేతలకు అవార్డులు ప్రదానం చేయనున్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)