Breaking News

ఆస్కార్ అవార్డ్ నామినేషన్స్.. ఎంపికైన నాటు నాటు సాంగ్

Published on Tue, 01/24/2023 - 19:13

సినీరంగంలో అందించే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్ అవార్డ్ నామినేషన్స్‌ విడుదలయ్యాయి. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన టాలీవుడ్ సంచలన మూవీ ఆర్ఆర్ఆర్ చిత్రం నుంచి 'నాటు నాటు సాంగ్' ఎంపికైంది. దాదాపు 22 ఏళ్ల తర్వాత భారతీయ చిత్రానికి నామినేషన్ దక్కింది. ఈ విషయాన్ని ఆర్ఆర్ఆర్ చిత్రబృందం ట్వీట్ చేసింది.  'సరికొత్త చరిత్ర సృష్టించాం' అంటూ పోస్ట్ చేసింది. ఇప్పటికే ఈ పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కిన సంగతి తెలిసిందే.

ఒరిజనల్ సాంగ్ విభాగంలో ఆర్ఆర్ఆర్ సాంగ్ నామినేట్ అయింది.  తాజాగా ఈ జాబితాను ఆస్కార్ నామినేషన్స్ కమిటీ వెల్లడించింది. ఈ ఏడాది 95వ ఆస్కార్ నామినేషన్స్‌ను ప్రకటించారు. ఈ ఏడాది మార్చి 13న అవార్డుల ప్రదానం జరగనుంది. ఇండియా నుంచి మరో రెండు డాక్యుమెంటరీలు స్థానం దక్కించుకున్నాయి.  షార్ట్ ఫిల్మ్ విభాగంలో డాక్యుమెంటరీ ది ఎలిఫెంట్ విష్పరర్స్, ఆల్ దట్ బ్రీత్స్ ఎంపికయ్యాయి.  మొత్తానికి నామినేషన్స్‌లో ఇండియా మూడు చిత్రాలు ఎంపికయ్యాయి.

ఒరిజినల్ సాంగ్ ఆస్కార్ నామినేషన్స్ జాబితా

  • నాటు నాటు (ఆర్‌ఆర్‌ఆర్‌)
  • అప్లాజ్‌ (టెల్‌ ఇట్‌ లైక్‌ ఎ ఉమెన్‌)
  • హోల్డ్‌ మై హ్యాండ్‌ ( టాప్‌గన్‌: మార్వెరిక్‌)
  • లిఫ్ట్‌ మీ అప్‌ (బ్లాక్‌ పాంథర్‌)
  • ది ఈజ్‌ ఏ లైఫ్‌ (ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌)

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)