'కౌన్ బనేగా కరోడ్‌పతి'లో ఆపరేషన్‌ సింధూర్‌ అధికారులు.. ఎంత గెలిచారంటే..?

Published on Sat, 08/16/2025 - 11:25

పహల్గాం ఉగ్రదాడికి  ప్రతీకారం తీర్చుకునేందుకు ఆపరేషన్‌ సింధూర్‌ పేరుతో పాక్‌పై భారత్ ఎదురుదాడికి దిగింది. అయితే, ఈ మెరుపు దాడులకు సంబంధించిన వివరాలను కేంద్ర రక్షణ, విదేశాంగ శాఖ మీడియాకు బ్రీఫింగ్ ఇచ్చింది. భద్రతా బలగాలకు చెందిన ఇద్దరు మహిళలు కల్నల్‌ సోఫియా ఖురేషి, వింగ్‌ కమాండర్‌ వ్యోమికా సింగ్‌ దాడులకు సంబంధించిన వివరాలను భారత ప్రజలకు ఎప్పటికప్పుడు తెలుపుతూ వచ్చారు. అయితే, వారు ఇప్పుడు అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా కరోడ్‌పతి (KBC) 17వ సీజన్‌లో పాల్గొని మరోసారి అందరి దృష్టినీ ఆకర్షించారు.

భారత భద్రతా బలగాలకు చెందిన  సైన్యం నుంచి కల్నల్ సోఫియా ఖురేషి,  వైమానిక దళం నుంచి వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, నావికాదళం నుంచి కమాండర్ ప్రేరణ డియోస్థలీ కలిసి  కౌన్ బనేగా కరోడ్‌పతి ప్రోగ్రామ్‌లో పాల్గొన్నారు.  ఆపరేషన్ సిందూర్‌లో భాగమైన ఈ అధికారులు, తమ ధైర్యం, దేశానికి చేసిన సేవ వంటి అంశాలను ఈ షోలో పంచుకున్నారు. అయితే, క్విజ్‌లో అద్భుతంగా ఆడి, రూ. 25 లక్షలు గెలుచుకున్నారు.  అమితాబ్ బచ్చన్( Amitabh Bachchan) హోస్ట్‌గా వ్యవహరించిన కౌన్ బనేగా కరోడ్‌పతి (KBC) 17వ సీజన్‌లోని  స్వాతంత్ర్య దినోత్సవ ఎపిసోడ్  చారిత్రాత్మకంగా మారింది.

ఇంగ్లాండ్‌ లీసెస్టర్‌లోని విక్టోరియా పార్క్‌లో ఉన్న "ఆర్చ్ ఆఫ్ రిమెంబరెన్స్" స్మారక చిహ్నాన్ని రూపొందించిన వ్యక్తే ఇండియాలో కూడా ఆయన రూపొందించిన స్మారక చిహ్నాం ఏంటి..?

ఏ)విక్టోరియా మెమోరియల్, బి) గేట్‌వే ఆఫ్ ఇండియా, సి) ఫోర్ట్ సెయింట్ జార్జ్, డి) ఇండియా గేట్

ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడంలో వారు మొదట్లో గందరగోళంగా ఉన్నప్పటికీ, ఆ ముగ్గురూ సరైన సమాధానాన్ని లాక్ చేయడానికి ఆడియన్స్ పోల్ లైఫ్‌లైన్‌ను ఉపయోగించారు. ఫైనల్‌గా ఇండియా గేట్ అని సరైన సమాధానం చెప్పారు. 'ఆర్చ్ ఆఫ్ రిమెంబరెన్స్' అనేది మొదటి ప్రపంచ యుద్ధ స్మారక చిహ్నం. దీనిని సర్ ఎడ్విన్ లుటియన్స్ రూపొందించారు. అతనే ఇండియా గేట్‌  స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేశారు. సరైన సమాధానం చెప్పినందుకు వారు రూ. 25 లక్షలు గెలుచుకున్నారు. గెలుచుకున్న ఆ డబ్బును వారి సంబంధిత సంస్థలతో అనుబంధించబడిన సంక్షేమ నిధులకు విరాళంగా ఇస్తామని ప్రకటించారు.

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)