Breaking News

‘ఆదిపురుష్‌’ థియేటర్‌లో అక్కడ ఎవరూ కూర్చోకండి

Published on Tue, 06/06/2023 - 14:46

ప్రస్తుతం సోషల్‌ మీడియా అంతా ‘ఆదిపురుష్‌’ పోస్టర్లతో నిండిపోయింది. పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌  హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓం రౌత్ దర్శకత్వం వహించారు.  ఈ చిత్రం విడుదల సమయం దగ్గర పడుతుండటంతో..  చివరి దశ ప్రమోషన్స్‌ను మేకర్స్ ప్రారంభించారు. తాజాగా ఆదిపురుష్ టీమ్ సినిమా రిలీజ్‌కు సంబంధించి ఓ ప్రకటన చేసింది.  ఆదిపురుష్ స్క్రీనింగ్ సమయంలో ప్రతి థియేటర్‌లో ఒక సీటు అమ్ముడుపోదు..  ఆ సీటులో ఎవరూ కూర్చోకూడదని మేకర్స్‌ చెప్పారు. ప్రజల విశ్వాసాలను కాపాడేందకు ఆ సీటును రామ భక్తుడు హనుమంతునికి అంకితం చేయబడుతుందని వారు పేర్కొన్నారు.

(ఇదీ చదవండి: లలితా జ్యువెలరీలో బంగారు ఆభరణాలు దొచుకున్న ఆ దొంగ కథే 'జపాన్‌'!)

అంతే కాకుండా వారు ఇలా ప్రకటించారు. "రామాయణం ఎక్కడ పఠించినా హనుమంతుడు కనిపిస్తాడు. ఇది మా నమ్మకం. ఈ నమ్మకాన్ని గౌరవిస్తూ, ప్రభాస్ నటించిన ఆదిపురుష్‌ని ప్రదర్శించే ప్రతి థియేటర్‌లో ఒక సీటు అమ్మకుండా హనుమంతుడికి రిజర్వ్ చేయబడుతుంది. రాముని  గొప్ప భక్తుడు హనుమంతుడి గురించి జూన్‌ 16న అందరూ తెలుసు​కోండి.'' అని యూనిట్‌ తెలిపింది.  తెలుగు, హిందీ, తమిళం, మలయాళంతో పాటు  కన్నడ  ఐదు భాషల్లో  ‘ఆదిపురుష్‌’ తెరపైకి రానుంది. చినజీయర్‌ స్వామి ముఖ్య అతిథిగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నేడు (జూన్‌6)న తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ స్టేడియంలో జరగనుంది.

(ఇదీ చదవండి: ఎంత టార్చర్‌ పెట్టారంటే.. చచ్చిపోదామనుకున్నా: నటి)

Videos

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)