Breaking News

ఆ సంస్థతో మాకు సంబంధం లేదు.. ఎన్టీఆర్ టీమ్ క్లారిటీ

Published on Tue, 07/14/2026 - 13:45

ఎన్టీఆర్.. ఈ శనివారం(జూలై 18) రాజకీయ అరంగేట్రంపై ప్రకటన చేయబోతున్నారని తొలుత రూమర్స్ వచ్చాయి. అనంతరం వాటిని ఖండిస్తూ రా ఎన్టీఆర్ అనే అభిమాన సంఘం ఆసక్తికర పోస్ట్ పెట్టింది. అలాంటిదేం లేదని క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు ఈ సంస్థతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఎన్టీఆర్ కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన వచ్చింది.

''రా ఎన్టీఆర్' పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఒక సంస్థ, ఎన్టీఆర్‌తో సంబంధం ఉన్నట్టుగా ప్రజల్లో భావన కలిగించేలా వ్యవహరిస్తున్న విషయం మా దృష్టికి వచ్చింది. ఈ సందర్భంగా స్పష్టంగా తెలియజేయదలచుకున్నది ఏమనగా, ఎన్టీఆర్‌కి గానీ, ఆయన కార్యాలయానికి గానీ, రా ఎన్టీఆర్ సంస్థతో లేదా దాని కార్యక్రమాలతో ఎలాంటి సంబంధం, అనుబంధం, అనుమతి లేదా ప్రమేయం లేదు. ఆ సంస్థకు ఎన్టీఆర్ తరఫున ప్రాతినిధ్యం వహించే హక్కు లేదు. అలాగే ఆయన పేరుతో ఎలాంటి ప్రకటనలు చేయడానికి లేదా కార్యక్రమాలు నిర్వహించడానికి ఎలాంటి అధికారమూ లేదు'

ఎన్టీఆర్‌కి సంబంధించిన ఏదైనా సేవా కార్యక్రమం, ప్రజా సంక్షేమ కార్యక్రమం, అధికారిక ప్రకటన లేదా ఇతర కార్యక్రమాల గురించి సమాచారం ఎన్టీఆర్ లేదా ఆయన అధికారిక బృందం మాత్రమే వెల్లడిస్తారు. అనధికారిక వ్యక్తులు లేదా సంస్థల ద్వారా ప్రచారం చేయబడే సమాచారం, ప్రకటనలు లేదా కార్యక్రమాలను అధికారికమైనవిగా లేదా విశ్వసనీయమైనవిగా పరిగణించవద్దని మనవి. ఈ అంశంపై ఇదే మా తరఫున తుది వివరణ. దీనితో ఈ విషయానికి సంబంధించిన అన్ని అపోహలు, వదంతులు, ఊహాగానాలకు పూర్తిగా ముగింపు పలుకుతున్న ఆశిస్తున్నాం. అధికారిక వర్గాల ద్వారా విడుదలయ్యే సమాచారాన్నే విశ్వసించాలని విజ్ఞప్తి చేస్తున్నాం' అని ఎన్టీఆర్ కార్యాలయం పేర్కొంది.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)