Breaking News

'దేవర' పార్ట్ 2లో స్టోరీ ఏం ఉండొచ్చు?

Published on Sat, 09/28/2024 - 08:21

'దేవర' సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. బ్లాక్‌బస్టర్ అనడం లేదు. అలా అని తీసిపారేయదగ్గ మూవీ అయితే కాదు. ఎన్టీఆర్ యాక్టింగ్, అనిరుధ్ బీజీఎం టమెయిన్ హైలైట్ అని చెప్పొచ్చు. ఓవరాల్‌గా చూసుకుంటే సగటు ప్రేక్షకుడు ఎంటర్‌టైన్ అయితే అవుతాడు. అయితే చివర్లో వచ్చే ట్విస్ట్ 'బాహుబలి'ని గుర‍్తు చేస్తుందని చాలామంది అంటున్నారు. మూవీలోని సీన్లు కూడా గతంలో వచ్చిన పలు చిత్రాల్లోని సన్నివేశాలని పోలినట్లు ఉన్నాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

(ఇదీ చదవండి: ‘దేవర’ మూవీ రివ్యూ)

ఏదేమైనా 'దేవర' సినిమా చూడగానే స్టోరీ అంతా ఇప్పుడు చెప్పేశారు. ఇక సీక్వెల్ కోసం ఏం దాచి ఉంచారా అనే సందేహం వస్తుంది. సరిగా గమనిస్తే బోలెడన్ని ప్రశ్నలు వస్తాయి. ఒకటి రెండు కాదు దాదాపు అరడజను ప్రశ్నలు ఉండనే ఉంటాయి. ఇంతకీ అవేంటి? సీక్వెల్ స్టోరీ ఏమై ఉండొచ్చు.  ఈ సినిమాని చూసి ఉంటేనే దిగువన పాయింట్స్ చదవండి. లేదంటే మళ్లీ ట్విస్టులన్నీ చెప్పేశామని అంటారు.

'దేవర' చూసిన తర్వాత సందేహాలు

  • సినిమా ప్రారంభంలో ప్రభుత్వ పెద్దలు చెప్పే యతి, దయ ఎవరు?

  • ఎర్రసముద్రం వాళ్లతో స్మగ్లింగ్ చేయించుకున్న మురుగన్ ఎలా చనిపోయాడు?

  • మురుగన్‌తో పాటు ఉండే డీఎస్పీ తులసికి ముఖం, ఒంటిపై దెబ్బలు ఎలా తగిలాయి?

  • నీటి లోపలున్న అస్థి పంజరాలు ఎవరివి?

  • అంత మత్తులో ఉన్నాసరే తనని చంపడానికి వచ్చిన వాళ్లని అందరినీ 'దేవర' మట్టుబెడతాడు. అలాంటి 'దేవర'ని చంపింది ఎవరు? ఎందుకు చంపాల్సి వచ్చింది? 

  • 'దేవర' ఊరు వదలి వెళ్లిపోయాడని ఇంటర్వెల్‌లో చెబుతారు. అప్పటికే చనిపోయి ఉంటాడు. ఇక సెకండాఫ్‌లో సముద్రంలోకి వెళ్లిన భైర మనుషులు చనిపోతారు. అప్పటికీ వర ఇంకా చిన్న పిల్లాడే. మరి ఇక్కడ భైర మనుషుల్ని చంపింది ఎవరు?

  • 'దేవర' స్టోరీ అంతా చెప్పిన ప్రకాశ్ రాజ్ ఎవరు? ఇంతకీ ప్రకాశ్ రాజ్ చెప్పిన స్టోరీ అంతా నిజమేనా?

  • జాన్వీని వర పెళ్లి చేసుకుంటాడా? సీక్వెల్ లో ఆమె పాత్ర తీరు ఇంతేనా?

పైన చెప్పిన ప్రశ్నలన్నింటికి సమాధానాలనే రెండో పార్ట్‌లో స్టోరీగా చూపిస్తారేమో అనిపిస్తుంది. ఇక ఎన్టీఆర్ లైనప్ చూస్తే ప్రస్తుతం 'వార్-2', ప్రశాంత్ నీల్‪‌తో సినిమాలు చేస్తున్నాడు. వీటి తర్వాత 'దేవర 2' ఉంటుందా? లేదంటే వీటితో సమాంతరంగా ఏమైనా చేస్తాడా అనేది చూడాలి?

(ఇదీ చదవండి: 'దేవర' రెమ్యునరేషన్స్.. ఎవరికి ఎంత ఇచ్చారు?)

Videos

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)