Breaking News

బాక్సాఫీస్ వసూళ్లు.. 'దేవర' సరికొత్త రికార్డులు

Published on Sat, 09/28/2024 - 13:22

ఎన్టీఆర్ 'దేవర' సరికొత్త రికార్డులు సెట్ చేసేలా ఉంది. ఎందుకంటే రిలీజ్‌కి ముందు ఓ మాదిరి ట్రోలింగ్‌కి గురైన ఈ సినిమా ఇప్పుడు తొలిరోజు ఏకంగా రూ.172 గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇన్నాళ్లు పాన్ ఇండియా సినిమా అంటే ప్రభాస్ మాత్రమే అనే దగ్గర నుంచి లిస్టులో తారక్ కూడా చేరిపోయాడు అనేంత వరకు వెళ్లింది. అలానే 'దేవర' పలు రికార్డులు కూడా సెట్ చేసినట్లు తెలుస్తోంది.

టాప్-5లోకి 'దేవర'
పాన్ ఇండియా అంటే తెలుగు, దక్షిణాది సినిమాలు మాత్రమే అనేలా ఉన్నాయి. ఎందుకంటే తొలిరోజు వసూళ్లలో తొలి ఐదు స్థానాల్లో మనమే ఉన్నాం మరి. ఆర్ఆర్ఆర్ (రూ.223.5 కోట్లు), బాహుబలి 2 (రూ.214.5 కోట్లు), కల్కి 2898 ఏడీ (రూ.191.5 కోట్లు), సలార్ (రూ.178.8 కోట్లు) ఇప్పటివరకు టాప్-4లో కొనసాగుతున్నాయి. వీటి తర్వాతి స్థానంలో దేవర (రూ.172 కోట్లు) వచ్చి చేరింది. అనంతరం కేజీఎఫ్ 2 (రూ.164.2 కోట్లు), ఆదిపురుష్ (రూ.136.8 కోట్లు), సాహో (రూ.125.6 కోట్లు) ఉన్నాయి.

(ఇదీ చదవండి: 'దేవర' పార్ట్ 2లో స్టోరీ ఏం ఉండొచ్చు?)

తెలుగు రాష్ట్రాల్లోనూ
ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ తొలిరోజు వసూళ్లలో 'దేవర' సరికొత్త రికార్డ్ సెట్ చేసిందనే చెప్పాలి. రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' రూ.74.11 కోట్లు సాధించగా.. ఇప్పుడు 'దేవర' రూ.54.21 కోట్ల షేర్‌తో రెండో స్థానంలోకి వచ్చింది. అంతకు ముందు ప్రభాస్ సలార్ రూ.50.49 కోట్లతో ఈ ప్లేసులో ఉండేది. ఈ లెక్కన చూసుకుంటే టాప్-2లోని రెండు మూవీస్ కూడా తారక్‌వే కావడం విశేషం.

ప్రభాస్ తర్వాత ఎన్టీఆరే?
ప్రస్తుత పరిస్థితులు చూసుకుంటే పాన్ ఇండియా రేంజులో ప్రభాస్ తర్వాత సిసలైన స్టార్ ఎన్టీఆరే అనిపిస్తున్నాడు. ఎందుకంటే సోలో హీరోగా తొలిరోజే రూ.172 కోట్ల కలెక్షన్ రాబట్టడం అంటే సాధారణమైన విషయం కాదు. ప్రస్తుతానికి తారక్ ఉన్నప్పటికీ 'పుష్ప 2', 'గేమ్ ఛేంజర్' తదితర చిత్రాలు రిలీజైతే లెక్కలు మారే ఛాన్సులు ఉంటాయి. 

(ఇదీ చదవండి: 'దేవర'తో రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ అయిందా?)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)