Breaking News

NTR 30:ఎన్టీఆర్‌-కొరటాల శివ సినిమా రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

Published on Sun, 01/01/2023 - 11:58

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌-కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌కు ఇది 30వ సినిమా. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన జనతా గ్యారేజ్‌ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా ప్రకటించి చాల నెలలు అయినప్పటికీ.. ఎలాంటి అప్‌డేట్స్‌ రాలేదు. దీంతో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుందా లేదా అనే అనుమానాలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రం బృందం ఓ క్రేజీ అప్‌డేట్‌ని వదిలి పుకార్లకు చెక్‌ పెట్టింది.

న్యూ ఇయర్‌ సందర్భంగా ఎన్టీఆర్‌ 30వ సినిమా విడుదల తేదిని ప్రకటించారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 5న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ మేరకు ఓ కొత్త పోస్టర్‌ని విడుదల చేసింది. ఫిబ్రవరి నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ఉండబోతున్నట్లు తెలుస్తోంది.  ఈ చిత్రానికి తమిళ్‌ యంగ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌ సంగీతం అందించనున్నాడు.  

ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత పాన్‌ ఇండియా స్టార్‌గా అవతరించాడు ఎన్టీఆర్‌. దీంతో ఆర్‌ఆర్‌ఆర్‌కు మించిన హిట్‌ కొట్టాలన్న కసితో ఉన్నాడాయన. ఇటు కొరటాల కూడా ఆచార్యతో ఊహించని ఫ్లాప్‌ని ఎదుర్కొన్నాడు. ఇప్పుడు ఆర్‌ఆర్‌ఆర్‌ రేంజ్‌లో ఒక హిట్‌ ఎన్టీఆర్‌కి, తన పూర్వ వైభవం తీసుకొచ్చేలా ఒక హిట్‌ కొరటాలకి అవసరం.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)