కమల్ హాసన్ కామెంట్స్ పై భగ్గుమన్న కర్ణాటక బీజేపీ
Breaking News
బిగ్‌బాస్ ఫేమ్ నోయల్ మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నాడా?
Published on Sat, 06/05/2021 - 20:08
యువ గాయకుడు, నటుడు, ‘బిగ్‌బాస్’ ఫేమ్ నోయల్ సేన్ ప్రేమ, పెళ్లి, విడాకుల గురించి అందరికి తెలిసిందే. హీరోయిన్ ఎస్తర్‌తో ప్రేమలో పడిన నోయల్.. 2019లో ఆమెను వివాహం చేసుకున్నారు. పెళ్లైన కొన్ని నెలలకే వారు విడిపోయారు. కోర్టు ఉత్తర్వులు రావడంతో ఈ ఇద్దరూ కూడా తమ విడాకుల విషయాన్ని 2020 బహిర్గతం చేశారు. అనంతరం నోయల్ బిగ్‌బాస్ షోకి వెళ్లి, అనారోగ్యం కారణంగా అర్థాంతరంగా బయటకు వచ్చారు.
అయితే బిగ్‌బాస్ ఇంట్లో ఉన్నది కొద్ది రోజులే అయినా.. తనదైన ముద్ర వేసుకున్నాడు నోయల్. సినిమాల్లో చూసిన నోయల్‌కి.. బిగ్‌బాస్‌లో చూసిన నోయల్‌కి చాలా తేడా కనిపించింది. ఒకనొక దశలో మరీ ఇంత మంచితనం పనికి రాదని కూడా నోయల్‌పై కామెంట్లు చేశారు నెటిజన్లు. ఇక బిగ్‌బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చిన నోయల్‌కు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేసింది. ఆయన చేసిన ట్వీట్లు, పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా నోయల్ చేసిన ట్వీట్‌పై నెటిజన్లు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.
‘ఓ ఎగ్జైటింగ్ న్యూస్ మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను.. ఈ విషయం చెప్పాలని ఎంతో ఆత్రుతగా ఉంది.. ఆగలేకపోతోన్నా’అంటూ ట్వీట్ చేశాడు నోయల్. దీంతో ఇది పక్కా పెళ్లి విషయమే అని నెటిజన్లు ఫిక్సయ్యారు. ‘మళ్లీ పెళ్లి చేసుకుంటున్నావా? అని కామెంట్లు చేస్తున్నారు. ఇక మరికొంత మంది అయితే.. సినిమాకి సంబంధించిన అప్డేట్ అయి ఉంటుందని కామెంట్లు పెడుతున్నారు. ఇంతకి ఆ ఎగ్జైటింగ్ న్యూస్ ఏంటో తెలియాలంటే.. నోయల్ చెప్పే వరకు ఆగాల్సిందే.
Am Gonna Share An Exciting News Soonnnn!!!!
— Noel (@mrnoelsean) June 5, 2021
Can't Wait For It!!! pic.twitter.com/XqjAofXZrA
Tags : 1