Breaking News

Adipurush : మరికొద్ది గంటల్లో రిలీజ్‌.. ప్రచారం ఎక్కడ?

Published on Wed, 06/14/2023 - 16:59

సినిమా తెరకెక్కించడం ఒకెత్తు అయితే.. దానిని జనాల్లోకి తీసుకెళ్లడం మరో ఎత్తు. అందుకే ప్రమోషన్స్‌ కోసం ప్రత్యేకంగా బడ్జెట్‌ కేటాయిస్తారు నిర్మాతలు. పక్కా ప్రణాళికతో వినూత్నంగా ప్రచారం చేస్తూ.. విడుదల రోజు వరకు తమ సినిమా పేరుని ప్రేక్షకులు గుర్తుపెట్టుకునేలా చేస్తారు. చిన్న సినిమాలు వారం, పది రోజుల ముందు ప్రమోషన్స్‌ స్టార్ట్‌ చేస్తే.. పాన్‌ ఇండియా సినిమాలు అయితే నెల ముందే ప్రచారం మొదలెడతాయి. ఇక రాజమౌళి లాంటివాడైతే సినిమా షూటింగ్‌ నుంచే ప్రమోషన్స్‌కి ప్రణాళికలు వేస్తాడు. ఆర్‌ఆర్‌ఆర్‌ విషయంలో కేవలం ప్రమోషన్స్‌కే రూ.20 కోట్ల వరకు కేటాయించినట్లు వార్తలు వినిపించాయి. అంతలా సినిమా ప్రమోషన్స్‌కి ప్రాధాన్యత ఇస్తారు మన దర్శకనిర్మాతలు. 

కానీ ఆదిపురుష్‌ యూనిట్‌ మాత్రం ఈ విషయాన్ని చాలా లైట్‌ తీసుకున్నట్లు కనిపిస్తుంది. సినిమా విడుదలకు ఒక్క రోజు(జూన్‌ 16న) మాత్రమే మిగిలి ఉన్నా.. ఎలాంటి ప్రచార కార్యక్రమం చేపట్టకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ముఖ్యంగా టాలీవుడ్‌లో అయితే ఈ సినిమాకు సరైన ప్రమోషన్‌ కార్యక్రమాలే చేపట్టలేదు.  

(చదవండి: ఆదిపురుష్‌.. టికెట్‌ రేట్లు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే!)

ఇటీవల తిరుపతిలో భారీ స్టాయిలో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ చేపట్టారు. అదే రోజు యాక్షన్‌ ట్రైలర్‌ని రిలీజ్‌ చేసి చేతులు దులుపుకున్నారు. ఆ రోజు నుంచి నేటి వరకు ఒక్కటంటే ఒక్క ప్రమోషన్‌ కార్యక్రమాన్ని కూడా నిర్వహించలేదు. కనీసం మీడియా ఇంటర్వ్యూలు కూడా చేపట్టకపోవడం గమనార్హం. ప్రధాన పాత్రలు పోషించిన ప్రభాస్‌, కృతీసనన్‌ కూడా తిరుపతి ఈవెంట్‌ తర్వాత సినిమా గురించి బయట ఎక్కడా మాట్లాడలేదు. 

ట్రెండింగ్‌లో ‘ఆదిపురుష్‌’
ఆదిపురుష్‌ విషయంలో విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. చిత్రబృందం ప్రమోషన్స్‌కి దూరంగా ఉన్నప్పటికీ.. సినిమా పేరు మాత్రం నెట్టింట ట్రెండింగ్‌గా మారింది. టాలీవుడ్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఆదిపురుష్‌ గురించే చర్చిస్తున్నారు. టికేట్లు భారీ స్థాయిలో అడ్వాన్స్‌ బుకింగ్‌ అవుతున్నాయి. ఒకనొక దశలో టికెట్‌ బుకింగ్‌ వెబ్‌సైట్లు క్రాష్‌ అయ్యానంటే ఆదిపురుష్‌ క్రేజ్‌ ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చు.  అడ్వాన్స్‌ బుకింగ్‌ ద్వారాలే ఈ సినిమాకు రూ. 100 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. జై శ్రీరామ్‌ నినాదానికి, ప్రభాస్‌కు ఉన్న క్రేజ్‌ ‘ఆదిపురుష్‌’కి బాగా కలిసొస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)