Breaking News

హద్దులు పెట్టుకోదలచుకోలేదు!

Published on Thu, 08/07/2025 - 01:25

‘‘ఇకనుంచి టాలీవుడ్, మాలీవుడ్, బాలీవుడ్‌... అంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండవు. ఉండేదంతా ఒక్కటే... ‘ఇండియన్‌ సినిమా’. అందుకే హద్దులు పెట్టుకోదలచుకోలేదు. కథ నచ్చితే సినిమా చేసేస్తా. హిందీ ‘వార్‌ 2’ ఒప్పుకోవడానికి కారణం స్క్రిప్ట్‌. చాలా బలమైన కథ కావడంతో ఈ సినిమా చేశాను’’ అని హీరో ఎన్టీఆర్‌ పేర్కొన్నారు. హృతిక్‌ రోషన్, ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందిన ‘వార్‌ 2’ ఈ నెల 14న విడుదల కానుంది.

 ఇటీవల ఓ ప్రముఖ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్‌ ఈ సినిమా ఒప్పుకోవడానికి గల ముఖ్య కారణం ‘కథ’ అని చెప్పారు. ఇంకా ఆ ఇంటర్వ్యూలో తన కుమారులు అభయ్‌ రామ్, భార్గవ్‌ రామ్‌ గురించి మాట్లాడారు. ‘‘వారసత్వాన్ని అనుసరించి మీరు హీరోలే అవ్వాలి అని మా అబ్బాయిలతో చెప్పను. ఓ వారధిలా ఉండి  ఈ ప్రపంచం గురించి, సంస్కృతుల గురించి వారికి అవగాహన కల్పించాలనుకుంటున్నాను. 

సొంతంగా అనుభవం సంపాదించుకునే స్వేచ్ఛను వాళ్లకు ఇవ్వాలనుకుంటున్నాను. అలాగే ఇంతకుముందు ఆదివారం కూడా షూటింగ్‌ చేసేవాడిని. అయితే ఇప్పుడు మాత్రం వారంలో ఒక్క రోజైనా కుటుంబంతో గడపాలని ఫిక్స్‌ అయి, ఆదివారం దాదాపు సెలవు తీసుకుంటున్నాను. పిల్లలు ఎదిగే కొద్దీ వాళ్ల చదువులతో బిజీ అయిపోతారు. దాంతో వాళ్లతో కావాల్సినంత టైమ్‌ గడపడానికి కుదరదు. అందుకే పండగ లప్పుడు ఇంటిపట్టునే ఉండి, పండగల అర్థం చెప్పడానికి ప్రయత్నిస్తుంటా’’ అని పేర్కొన్నారు.

Videos

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)