Breaking News

ఫస్ట్‌ టైమ్‌ ఎక్కువగా డ్యాన్స్‌ చేశా!

Published on Tue, 03/21/2023 - 04:27

‘‘ఒక హీరో నిర్మాతగా చేయడం వేరు. కానీ, హీరోగా నటిస్తూనే దర్శకత్వం చేయడం గ్రేట్‌. ‘దాస్‌ కా ధమ్కీ’కి హీరో, నిర్మాత, డైరెక్టర్‌.. ఇలా మూడు బాధ్యతలని విశ్వక్‌ చక్కగా నిర్వర్తించారు. నేను పని చేసిన దర్శకుల్లో త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌గారి తర్వాత అంత ఎనర్జీ ఉన్న దర్శకుడిని విశ్వక్‌లో చూశాను’’ అని హీరోయిన్‌ నివేదా పేతురాజ్‌ అన్నారు. విశ్వక్‌ సేన్‌ హీరోగా నటించి, దర్శకత్వం వహించడంతో పాటు నిర్మించిన చిత్రం ‘దాస్‌ కా ధమ్కీ’. ఈ సినిమా రేపు (బుధవారం) విడుదలవుతోంది. ఈ సందర్భంగా నివేదా పేతురాజ్‌ మాట్లాడుతూ– ‘‘విశ్వక్‌తో ‘పాగల్‌’ మూవీ చేశాను. ఆ తర్వాత ‘దాస్‌ కా ధమ్కీ’ కథ యూనిక్‌గా అనిపించడంతో ఓకే చెప్పాను. మాస్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రమిది.

నా కెరీర్‌లో తొలిసారి ఈ చిత్రంలో గ్లామరస్‌ రోల్‌తో పాటు ఎక్కువగా డ్యాన్స్‌ చేశాను. విశ్వక్‌లో అద్భుతమైన ఐడియాలు ఉన్నాయి. అయితే తానే నటుడిగా నటిస్తూ డైరెక్షన్‌ చేయడం కాకుండా వేరే హీరోలని డైరెక్ట్‌ చేస్తే బావుంటుందని నా అభిప్రాయం. తన కెరీర్‌లో ‘దాస్‌ కా ధమ్కీ’ ఒక మైలురాయిగా నిలుస్తుంది. నేను కేవలం సినిమాలపైనే ఆధారపడటం లేదు. చెన్నైలో రెస్టారెంట్, ఫ్లవర్‌ షాప్‌ వ్యాపారాలు చేస్తున్నాను. దర్శకత్వం చేయాలని ఉంది కానీ, అందుకు ఇంకా టైమ్‌ పడుతుంది. నిర్మాతల కష్టాలు కళ్లారా చూసిన నాకు సినిమా నిర్మించే ఆలోచన లేదు. ప్రస్తుతం సుస్మితగారు నిర్మిస్తున్న ఓ సినిమా, హిందీలో టీ సిరీస్‌ వారి సినిమా చేస్తున్నాను’’ అన్నారు.     
 

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు