Breaking News

అలాంటి సినిమాల్లో నటించను : నిత్యా మీనన్‌

Published on Tue, 10/22/2024 - 12:46

పాత్ర నచ్చితే చాలు చిన్న పెద్ద సినిమా అనే తేడా చూపకుండా నటిస్తూ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది నిత్యా మీనన్‌. హీరో ఎవరైనా సరే నిత్యా మీనన్‌ పాత్ర మాత్రం చాలా ఆ సినిమాలో కీలకంగా ఉంటుంది. భారీ సినిమా, పారితోషికం ఎక్కువ అని సినిమాలు ఒప్పుకొదు. తన పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే సినిమాలో నటిస్తుంది. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెబుతూ..తన సినిమాల ఎంపిక గురించి ఆసక్తిక వ్యాఖ్యలు చేసింది.

(చదవండి: అభిమానులకు విజయ్‌ పిలుపు.. మొదటి సభకు ఏర్పాట్లు)

‘70వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ నటిగా ఎంపిక అవుతానని ఊహించలేదు. అవార్డులు, రివార్డుల కోసం సినిమాల్లో నటించను. నేను పోషించిన పాత్ర నాకు సంతోషాన్నిస్తే చాలనుకున్నా. దాన్ని దృష్టిలో పెట్టుకొనే పాత్రలను ఎంపిక చేసుకుంటా. . భారీ బడ్జెట్‌తో తీసే మసాలా సినిమాల్లో అవకాశం వచ్చినా నటించను. అలాంటి పాత్రలంటే నాకు ఆసక్తి ఉండదు. మంచి పాత్ర అయితే చిన్న సినిమా అయినా అంగీకరిస్తా’ అని నిత్యా మీనన్‌ అన్నారు. 

(చదవండి: తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన యూట్యూబర్ హర్ష సాయి)

కాగా, ‘తిరు’ సినిమాకుగాను నిత్యామీనన్‌కు జాతీయ అవార్డు లభించింది. ఈ చిత్రంలో ధనుష్‌ హీరోగా నటించగా, రాఖీ ఖన్నా హీరోయిన్‌గా నటించింది. మిత్రన్ జవహర్ దర్శకత్వం వహించారు. ఇందులో హీరో స్నేహితురాలిగా నిత్యమీనన్‌ తనదైన నటనతో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆమె పాండిరాజ్‌ దర్శకత్వంలో విజయ్‌ సేతుపతితో కలిసి ఓ సినిమా చేస్తున్నారు. అలాగే ‘గోల్డెన్‌ వీసా’, ఇడ్లికడై అనే సినిమాల్లోనూ నటిస్తున్నారు. 

Videos

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)