Breaking News

‘స్వయంభూ’ కోసం వియత్నామ్‌ వెళ్లిన హీరో నిఖిల్‌

Published on Fri, 09/08/2023 - 06:00

హీరో నిఖిల్‌ సిద్ధార్థ వియత్నామ్‌లో వాలిపోయారు. ఏదో వెకేషన్‌కి వెళ్లుంటారేమో అనుకుంటే పొరబడినట్టే. తన తాజా పాన్‌ ఇండియా చిత్రం ‘స్వయంభూ’ కోసం నెల రోజులు ప్రత్యేక శిక్షణ తీసుకునేందుకు వియత్నామ్‌ వెళ్లారాయన. భరత్‌ కృష్ణమాచారి దర్శకత్వం వహించనున్న మూవీ ‘స్వయంభూ’. ఠాగూర్‌ మధు సమర్పణలో భువన్, శ్రీకర్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

యుద్ధం నేపథ్యంలో రూపొందనున్న ఈ సినిమాలో యోధునిగా కనిపించనున్నారు నిఖిల్‌. ఈ పాత్రకు సంబంధించి ఆయుధాలు, మార్షల్‌ ఆర్ట్స్, గుర్రపు స్వారీలో శిక్షణ తీసుకుంటున్నారు. సైగాన్‌లోని కొంతమంది బిగ్గెస్ట్‌ స్టంట్‌ మాస్టర్‌లు ‘స్వయంభూ’ యూనిట్లో భాగంగా ఉండి యాక్షన్‌ సీక్వెన్స్‌ల కోసం నిఖిల్‌కి శిక్షణ ఇస్తారు. నెల రోజుల పాటు శిక్షణ తీసుకోనున్నారు నిఖిల్‌. ఈ చిత్రానికి సంగీతం: రవి బస్రూర్, కెమెరా: మనోజ్‌ పరమహంస, సహనిర్మాతలు: విజయ్‌ కామిశెట్టి, జీటీ ఆనంద్‌.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)