Breaking News

అవునా.. ఆ వార్త నావరకు రాలేదు: నిహారిక

Published on Sat, 05/13/2023 - 18:30

సోషల్‌ మీడియాలో తనపై వస్తున్న రూమర్స్‌పై మెగా డాటర్‌ నిహారిక స్పందించారు.  ఈ మధ్య కాలంలో కొంతమంది సోషల్‌ మీడియాలో మరాద్య లేనట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత ఆమె నటిగా మరోసారి ప్రేక్షకులను పలకరించబోతున్నారు. ఆమె ప్రధాన పాత్ర నటించిన  ‘డెడ్‌ పిక్సెల్స్‌’అనే వెబ్‌ సిరీస్‌ త్వరలోనే రిలీజ్‌ కాబోతుంది.

ఈ నేపథ్యంలో ఆమె తాజాగా ఓ యూట్యూబ్‌ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్‌, సోషల్‌ మీడియాలో వస్తున్న రూమర్స్‌పై స్పందించారు. యాక్టింగ్‌పై ఆసక్తితోనే చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టానని, వెండితెర, ఓటీటీ.. ఏదైనా వందశాతం కష్టపడి పని చేస్తానని చెప్పుకొచ్చింది. ఇక సోషల్‌ మీడియాలో వచ్చే రూమర్స్‌ గురించి మాట్లాడుతూ..‘వాటిని నేను పెద్దగా పట్టించుకోను.

(చదవండి: ఉపాసనపై కామెంట్స్.. ఓ వ్యక్తిని చితకబాదిన చెర్రీ ఫ్యాన్స్!)

మొదట్లో సోషల్‌ మీడియాలో వచ్చే కామెంట్స్‌ని చూసేదాన్ని. బాధపడేదాన్ని. కానీ రాను రాను వాటిని పట్టించుకోవడం మానేశా. అంతేకాదు కొన్ని రూమర్స్‌ చూసి నవ్వుకుంటాను. సైరా సినిమా సమయంలో నాపై వచ్చిన మీమ్స్‌ చూసి పడి పడి నవ్వాను’ అని నిహారిక చెప్పుకొచ్చింది. ఇక త్వరలోనే రామ్‌ చరణ్‌ ఐపీఎల్‌లో ఒక టీమ్‌ కొనుగోలు చేస్తున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. నిజమేనా? అని యాంకర్‌ ప్రశ్నించగా.. ‘అవునా.. ఏ టీమ్‌ కొంటున్నారు? ఏమో మరి నాకు అయితే తెలియదు. ఇంటర్వ్యూ అయ్యాక అన్నయ్యను అడగాలి’అని వివరించింది.

Videos

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు