Breaking News

ఎక్కువ సినిమాలు చేయడం సక్సెస్ కాదు

Published on Wed, 09/23/2026 - 07:13

ఏ రంగంలోనైనా సరే సక్సెస్‌ అవ్వాలనే చూస్తారు. ఒక్కసారి విజయం సాధిస్తే తర్వాత జీవితమే మారిపోతుంది. అది సక్సెస్‌‌కి ఉన్న పవర్‌. అయితే ఇది వరించాలంటే ప్రతిభతో పాటు అదృష్టం తోడవ్వాలి. అలాంటి అదృష్టం కోసమే హీరోయిన్ నిధి అగర్వాల్‌ ఎదురుచూస్తోంది. హైదరాబాద్‌‌లో పుట్టిన ఈ బ్యూటీ.. 2017లో మున్నా మైఖేల్‌ అనే హిందీ చిత్రంతో ఇండస్ట్రీలోకి వచ్చింది. నాగచైతన్య 'సవ్యసాచి'తో తెలుగులోకి వచ్చింది. 'భూమి'తో తమిళంలోకి పరిచయమైంది.

అయితే గత నాలుగైదేళ్లలో తెలుగులో పవన్‌ కల్యాణ్‌తో హరిహర వీరమల్లు, ప్రభాస్‌‌తో రాజాసాబ్‌ మూవీస్ మాత్రమే చేసింది. వీటిపై చాలా ఆశలు పెట్టుకుంది గానీ ఇవి దారుణంగా నిరాశపరిచాయి. చెప్పాలంటే ఘోరమైన డిజాస్టర్స్ అయ్యాయి. అయినప్పటికీ సరైన సక్సెస్‌ కోసం ఈ బ్యూటీ పోరాడుతూనే ఉంది. ఆకర్షణీయమైన అందం, అభినయం ఉన్నా పాన్‌ ఇండియా కథానాయికిగా గుర్తింపు వచ్చినా వాటికి అదృష్టం మాత్రం తోడవ్వలేదు. అందుకే హీరోయిన్‌గా తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి, ఉన్నత స్థాయికి చేరుకోవడానికి పోరాటం చేస్తున్నానని చెప్పుకొచ్చింది.

ఎక్కువ సంఖ్యలో సినిమాలు చేయడమే సక్సెస్‌ కాదు. ప్రతిభని నిరూపించుకుంటూ ఉన్నత స్థాయికి ఎదగడమే నిజమైన విజయం. అలా దక్షిణాది చిత్ర పరిశ్రమల్లో మంచి అవకాశాల కోసం నా ప్రయత్నాలు మొదలుపెట్టాను. నటిగా సాధించాలన్న తన లక్ష్యమే తనకు ఉత్తేజం పరుస్తోంది. సహజంగానే నేను కష్టజీవిని. నేను చేరాల్సిన స్థానం కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉంటాను అని నిధి అగర్వాల్‌ పేర్కొంది.

Videos

2 షేర్లు.. ₹6.25 కోట్లు!టాటా సన్స్ IPO సంచలనం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మిస్టరీగా నర్సింగ్ విద్యార్థిని మృతి

ఉద్యోగులకు భారీ బొనాంజా! కనీస వేతనం ₹63 వేలు!

సుమలతపై తోటి డాన్సర్ల దాడి...!

లోకేష్ రాజీనామా! గవర్నర్ ముందు లోకేష్ DSC స్కామ్ బండారం

ఎన్ని కేసులు పెడతావో.. పెట్టుకో నీ ఆటలు కట్టిస్తాం..

చంద్రబాబు అరాచకాలపై భారీ వర్షంలో జగన్ ఉగ్రరూపం

నానికి సీఎం రేవంత్ రిప్లై ఇదే

MLA చెప్పినవారికే పింఛన్లు.. బయటపడ్డ సంచలన ఆడియో క్లిప్

జానీ మాస్టర్ భార్య సుమలతకు బిగ్ షాక్

Photos

+5

ఫ్యామిలీతో జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాశ్.. ఫోటోలు

+5

గ్రాండ్‌గా స్టార్ డైరెక్టర్ కూతురి ఎంగేజ్‌మెంట్‌.. ఫోటోలు

+5

ది ప్యారడైజ్‌ స్టైలిష్ లుక్‌లో హీరో నాని.. ఫోటోలు

+5

బ్లాక్‌డ్రెస్‌లో హీరోయిన్ రష్మిక గ్లామర్.. ఫోటోలు

+5

తిరుమల : వైభవోపేతంగా చక్రధారుడి చక్రస్నానం (ఫొటోలు)

+5

మధుబని ఓధనా చీరలో మిల్కీ బ్యూటీ తమన్నా బ్యూటిఫుల్‌ లుక్‌.. (ఫొటోలు)

+5

చీరలో ఉన్న ఈ బ్యూటీని గుర్తుపట్టారా? (ఫొటోలు)

+5

పట్టుచీర.. మల్లెపూలు.. మెరిసిపోతున్న హెబ్బా (ఫొటోలు)

+5

ఏపీలోని పలు జిల్లాల్లో వర్ష బీభత్సం (ఫొటోలు)

+5

తిరుమలలో తెలుగు హీరోయిన్ అద్భుతమైన డ్యాన్స్...ఎవరో తెలుసా? (ఫొటోలు)