Breaking News

గుడిపై అపచారం.. వేణుపై భగ్గుమంటున్న నెటిజన్లు

Published on Fri, 01/23/2026 - 10:47

‘బలగం’ సినిమాతో దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హాస్యనటుడు వేణు యెల్దండి.. తొలి సినిమాతోనే భారీ హిట్‌ కావడంతో తనపై అంచనాలు పెరిగాయి. ఈ క్రమంలోనే ఎల్లమ్మ మూవీతో మరోసారి ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. చిత్రంలో సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ కథానాయకుడు. తాజాగా విడుదలైన గ్లింప్స్‌ అదిరిపోయిందని నెటిజన్లు రివ్యూలు కూడా ఇచ్చేశారు. మూవీ షూటింగ్‌ పనుల్లో ఉన్న వేణుపై సోషల్‌మీడియాలో విరుచుకుపడుతున్నారు.

తాజాగా వేణు తన షోషల్‌మీడియాలో కొన్ని ఫోటోలు షేర్‌ చేశాడు.  తెలంగాణలోని ఓ ఆలయ ప్రాంగణంలో ఆయన ఫోటోలు దిగాడు.  ఆ సమయంలో తను షూ ధరించే ఉండటంతో నెటిజన్లు భగ్గుమంటున్నారు. ఈ క్రమంలో వేణుపై విరుచుకుపడుతున్నారు. షూ ధరించి గుడిపైకి మంచిగానే వెళ్లినవ్‌ అంటూనే హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. 

అయితే, మరికొందరు వేణుకు మద్ధతుగా నిలుస్తున్నారు. తను కూర్చొని ఉన్నది ప్రధాన ఆలయం కాదని చెబుతున్నారు. ఆపై సినిమా షూటింగ్‌ కాబట్టి  ఎక్కువగా విద్యుత్‌ వైర్లు ఉంటాయని అందుకే తను అలా షూ ధరించాడని తెలుపుతున్నారు. అయితే, ఈ వివాదం గురించి వేణు స్పందించలేదు. షూటింగ్‌లో భాగంగా తనపని తాను చేసుకుంటూ పోతున్నాడు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)