Breaking News

విజయ్‌ దేవరకొండ, అఖిల్‌ కెరీర్‌ని దెబ్బ తీసిన ‘బామ్మర్ది’!

Published on Sun, 04/30/2023 - 13:58

ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌ సినిమాలు పాన్‌ ఇండియా స్థాయిలో రాణిస్తున్నాయి. దీంతో బడా హీరోలతో పాటు యంగ్‌ స్టార్స్‌ కూడా పాన్‌ ఇండియాపై ఫోకస్‌ పెట్టారు. వాటిలో చాలా వరకు విజయవంతం  అయ్యాయి. కానీ ఓ రెండు చిత్రాలు మాత్రం భారీ అంచనాలతో విడుదలై.. అట్టర్‌ ఫ్లాప్‌ చిత్రాలుగా మారాయి. అవే విజయ్‌ దేవరకొండ ‘లైగర్‌’, అఖిల్‌ ‘ఏజెంట్‌’.

పూరి జగన్నాథ్‌ తెరకెక్కించిన ‘లైగర్‌’పై బాలీవుడ్‌లో మంచి బజ్‌ క్రియేట్‌ అయింది. ప్రచార చిత్రాలు.. ప్రమోషన్‌ కార్యక్రమాలు చూసి మరో తెలుగు సినిమా.. పాన్‌ ఇండియా స్థాయిలో రాణిస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద దారుణంగా బోల్తా పడింది. తొలి రోజు మంచి ఓపెనింగ్స్‌ రాబట్టినా.. తర్వాత రోజు నుంచి చతికిల పడింది. భారీ బడ్జెట్‌తో తెరరెక్కిన లైగర్‌.. బయ్యర్లకు తీవ్ర నష్టాలను మిగిల్చింది.

(చదవండి: సోషల్‌ మీడియాలో మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్న రష్మిక)

ఇక ఈ నెల 28న విడైదలైన ‘ఏజెంట్‌’పై కూడా అలాంటి అంచనాలే ఏర్పడ్డాయి. ఈ సినిమాతో అఖిల్‌ పాన్‌ ఇండియా స్టార్‌ అవ్వడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ విడుదలైన తొలి రోజు ఈ మూవీ డిజాస్టర్‌ టాక్‌ని సొంతం చేసుకుంది. లైగర్‌ కోసం విజయ్‌ దేవరకొండ.. ఏజెంట్‌ కోసం అఖిల్‌ చాలా కష్టపడ్డారు. సిక్స్‌ ప్యాక్‌ కూడా చేశారు. అయితే తమ కష్టానికి తగ్గ కథను ఎంచుకోవడంలో ఇద్దరు విఫలమయ్యారు. అందుకే రెండు సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి.

(చదవండి: మండుటెండలో తిరుగుతున్నా, ఎవరూ ఇల్లు అద్దెకివ్వడం లేదు: నటి)

అయితే ఈ రెండు చిత్రాల డిజాస్టర్‌ వెనుక ‘బామ్మర్ది’ ఉన్నాడనే టాక్‌ సోషల్‌ మీడియాలో నడుస్తోంది. ఎవరీ బామ్మర్ది అంటే.. ఈ రెండు చిత్రాల్లో ‘సాలా’ అనే పదం బాగా హైలెట్‌ అయింది. సాలా అంటే హిందీలో బామ్మర్ది అని అర్థం. దీన్ని తెలుగులో బూతు పదంగానూ వాడుతున్నారు.  ఇలాంటి పదాలను బాగా ఇష్టపడే పూరి జగన్నాథ్‌.. లైగర్‌కి ‘సాలా క్రాస్ బ్రీడ్’ అనే ట్యాగ్ లైన్ తగిలించారు.

ఇక ఏజెంట్‌లో సురేందర్‌ రెడ్డి హీరో క్యారెక్టర్‌ని ‘వైల్డ్‌ సాలా’ అంటూ పరిచయం చేయించాడు. ఈ రెండింటిలోనూ ‘సాలా’ కామన్‌గా ఉంది. రెండూ డిజాస్టర్స్‌ అయ్యాయి. దీంతో టాలీవుడ్‌కి ‘సాలా’ పదం అచ్చిరావడంలో లేదని కొంతమంది నెటిజన్స్‌ అభిప్రాయపడుతున్నారు. అయితే ఇది సిల్లీ సెంటిమెంట్‌. కంటెంట్‌లో బలం లేకపోవడంతో రెండు చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద బోల్తాపడ్డాయి. అయితే టాలీవుడ్‌లో సెంటిమెంట్లను బాగా నమ్ముతారు. నిజంగా సాలా పదం అచ్చిరాదేమో అని భావించేవాళ్లు కూడా ఉంటారు. మరి భవిష్యత్తులో ‘సాలా’తో సాలిడ్‌ హిట్‌ కొడతారో లేదా సెంటిమెంట్‌తో ఆ పదమే వాడడానికి భయపడతారో చూడాలి. 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)