Breaking News

సుడిగాలి సుధీర్‌ ఫ్యాన్స్‌ ఖుషీగా ఉన్నారు: దర్శకుడు

Published on Sat, 07/30/2022 - 19:46

Nee Kalle Diwali Song Out From Sudheer Gaalodu Movie: సుడిగాలి సుధీర్‍, గెహ్నా సిప్పి హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం `గాలోడు`. ప‌క్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా ద‌ర్శ‌కుడు రాజ‌శేఖ‌ర్ రెడ్డి పులిచ‌ర్ల ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ప్ర‌కృతి స‌మ‌ర్ప‌ణ‌లో సంస్కృతి ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్ప‌టికే విడుద‌లైన `గాలోడు` టీజ‌ర్ సోష‌ల్ మీడియాలో మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇక‌ ఫ‌స్ట్ సాంగ్ ప్రోమో యూట్యూబ్‌లో 13 ల‌క్ష‌ల‌కు పైగా వ్యూస్ సొంతం చేసుకుని లిరిక‌ల్ సాంగ్‌పై మ‌రింత ఆస‌క్తిని క‌లిగించింది. తాజాగా `నీ కళ్లే దివాళి...` లిరిక‌ల్ వీడియో సాంగ్‌ను విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌.

మ్యూజిక్ డైరెక్ట‌ర్ భీమ్స్ స్వ‌ర‌ప‌రిచిన ఈ పాట ట్రెమండ‌స్ రెస్పాన్స్‌తో ఇన్‌స్టంట్‌ చార్ట్‌బ‌స్ట‌ర్ గా నిలిచింది. ఈ పాట‌లో సుధీర్ డ్యాన్స్‌, ఫారెన్ లొకేష‌న్లు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి. ప్ర‌స్తుతం ఈ పాట యూ ట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉండ‌డం విశేషం.ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శకుడు రాజ‌శేఖ‌ర్ రెడ్డి పులిచ‌ర్ల మాట్లాడుతూ - ```గాలోడు` ఫ‌స్ట్ సాంగ్ ప్రోమో యూ ట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నిలిచింది. ఇప్పుడు `నీ కళ్లే దివాళి` పాట కూడా ఇన్‌స్టంట్ హిట్ అయ్యింది. సుధీర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. భీమ్స్ అద్భుత‌మైన ట్యూన్ ఇచ్చారు. శ్రీ‌నివాస తేజ లిరిక్స్ క్యాచీగా ఉన్నాయి. షాహిద్ మాల్య చ‌క్క‌గా ఆల‌పించాడు. యాక్షన్ అండ్‌ మాస్ ఎలిమెంట్స్‌తో రూపొందిన `గాలోడు` సినిమా కచ్చితంగా సుధీర్ కి టర్నింగ్ పాయింట్ అవుతుంది. షూటింగ్ పూర్త‌య్యింది. ఫ‌స్ట్ సాంగ్‌తో ప్ర‌మోష‌న్స్ స్టార్ట్ చేశాం. త్వ‌ర‌లోనే విడుద‌ల తేదిని ప్ర‌క‌టిస్తాం`` అని తెలిపారు. 



Videos

మహారాష్ట్ర థానేలో కోవిడ్ తో 21 ఏళ్ల యువకుడు మృతి

ఎన్టీఆర్ తో శృతి హాసన్..?

కేసీఆర్ తో కేటీఆర్ కీలక భేటీ.. కవితకు నో ఎంట్రీ..!

వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితిపై శ్యామల కామెంట్స్

చంద్రబాబు, లోకేష్ చెప్పినట్లు కొందరు పోలీసులు పని చేస్తున్నారు

ఇంత నీచానికి దిగజారాలా.. నిజాయితీ గల అధికారిపై కిలాడీ లేడితో కుట్ర

జగన్ పొదిలి పర్యటన.. టీడీపీ నేతలకు చెమటలు

కవిత లేఖపై జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

కవిత కొత్త పార్టీ.. గంగుల సంచలన వ్యాఖ్యలు

Man Ki Baat: సంకల్పానికి, సాహసానికి ఆపరేషన్ సిందూర్ ప్రతీక: మోదీ

Photos

+5

అమ్మ బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసిన హీరోయిన్‌ లయ.. ఫోటోలు

+5

Miss World 2025 : టాప్‌ మోడల్‌ పోటీలో గెలిచిన సుందరీమణులు (ఫొటోలు)

+5

మతాలు వేరైనా పెళ్లి బంధంతో ఒక్కటైన యాంకర్ డాలీ, కరమ్ అబ్బాస్ (ఫోటోలు)

+5

కేన్స్‌లోని మధుర క్షణాలను పంచుకున్న జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)