Breaking News

NBK 111: పవర్‌ఫుల్‌ క్వీన్‌గా నయనతార!

Published on Tue, 11/18/2025 - 12:55

లేడీ సూపర్‌స్టార్‌ నయనతార(Nayanthara ) టాలీవుడ్‌లో మళ్లీ బిజీ అయింది. కొన్నాళ్ల పాటు తెలుగు తెరపై అంతగా కనిపించని నయన్‌..ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకెళ్తుంది. ప్రస్తుతం మెగాస్టార్‌ చిరంజీవి సరసన ‘మన శంకర్‌ వరప్రసాద్‌ గారు’ చిత్రంలో నటిస్తోంది. దీంతో పాటు సీనియర్‌ హీరో నందమూరి బాలకృష్ణ కొత్త సినిమాలోనూ నయన్‌ హీరోయిన్‌గా నటించబోతోంది. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో బాలయ్య ఓ సినిమా(#NBK111) చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో బాలయ్యకు జోడీగా నయనతార నటించబోతున్నట్లు చిత్ర యూనిట్‌ ప్రకటించింది. 

నేడు(నవంబర్‌ 18) నయనతార బర్త్‌డే. ఈ సందర్భంగా ఓ స్పెషల్‌ వీడియోని రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ఇందులో నయనతార పవర్‌ఫుల్‌ మహారాణి పాత్రలో కనిపించబోతున్నట్లు నిర్మాణ సంస్థ వెల్లడించింది. ‘సముద్రమంత ప్రశాంతతను, తుపాను అంత బీభత్సాన్ని తనలో మోసే రాణి మా సామ్రాజ్యంలోకి అడుగుపెట్టనుంది’ అంటూ వీడియోతో ద్వారా చిత్ర యూనిట్‌  నయనతారకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. 

కాగా, బాలయ్యతో నయనతార ఇప్పటికే మూడు సినిమాల్లో నటించింది. తొలుత సింహా చిత్రంలో వీరిద్దరు కలిసి నటించారు. ఆ తర్వాత ‘జై సింహా’, ‘శ్రీరామరాజ్యం’ చిత్రాల్లోనూ ఈ హిట్‌ జోడీ రిపీట్‌ అయింది. ఇప్పుడు నాలుగోసారి వెండితెరపై ఈ జంట అలరించబోతుంది. గతంలో మలినేని గోపిచంద్‌, బాలయ్య కాంబోలో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ సూపర్‌ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఈ కాంబో రిపీట్‌ కావడంతో ఈ చిత్రంపై ఆసక్తి నెలకొంది. 

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు