Breaking News

సుందర్‌ డైరెక్షన్‌లో...

Published on Wed, 09/18/2024 - 05:44

నయనతార, ఆర్‌జే బాలాజీ లీడ్‌ రోల్స్‌లో నటించిన తమిళ ఫ్యాంటసీ కామెడీ ఫిల్మ్‌ ‘ముకుత్తి అమ్మన్‌’ (తెలుగులో ‘అమ్మోరు తల్లి’). ఆర్‌జే బాలాజీ, ఎన్‌జే శరవణన్‌ కలిసి దర్శకత్వం వహించిన ఈ సినిమా 2020 నవంబరులో డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలై, విశేష ప్రేక్షకాదరణను దక్కించుకుంది. వేల్స్‌ ఫిల్మ్‌ ఇంటర్‌నేషనల్‌ సంస్థ నిర్మించింది. ఈ  సినిమాకు సీక్వెల్‌గా ‘ముకుత్తి అమ్మన్‌ 2’ రానుందని, ఇందులోనూ నయనతార లీడ్‌ రోల్‌లో నటిస్తారని, ఈ ఏడాది జూలైలో వేల్స్‌ ఫిల్మ్‌ ఇంటర్‌నేషనల్‌ ప్రకటించింది. కానీ ఆ సమయంలో దర్శకుడి పేరును వెల్లడించలేదు.

తాజాగా ‘ముకుత్తి అమ్మన్‌ 2’ సినిమాకు సుందర్‌. సి దర్శకత్వం వహించనున్నట్లుగా వెల్లడించారు మేకర్స్‌. ఈ చిత్రంలో సుందర్‌. సి ఓ పాత్ర చేసే చాన్స్‌ కూడా ఉందట. కాగా ‘ముకుత్తి అమ్మన్‌ 2’కు ఆర్‌జే బాలాజీ దర్శకత్వం వహిస్తారని, త్రిష లీడ్‌ రోల్‌లో నటిస్తారని ప్రచారం జరిగింది. అయితే తొలి భాగంలో లీడ్‌ రోల్‌లో నటించిన నయనతారనే మలి భాగంలోనూ లీడ్‌ రోల్‌ చేయనున్నట్లుగా ప్రకటన వచ్చింది. ఆర్‌జే బాలాజీ స్థానంలో దర్శకుడిగా మాత్రం సుందర్‌. సి వచ్చారు. ఇలా ‘ముకుత్తి అమ్మన్‌ 2’ డైరెక్టర్‌ మారారు.  త్వరలోనే చిత్రీకరణ ఆరంభం కానుంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)