Breaking News

400 మంది కష్టాన్ని ట్రోల్స్‌ చేయద్దు : స్టార్‌ డైరెక్టర్‌

Published on Sun, 11/01/2026 - 14:47

కోలీవుడ్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రాల్లో ‘మూకుత్తి అమ్మన్ 2’ ( తెలుగులో మహాశక్తి) ఒకటి.  సుమారు రూ.100 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాకు వేల్స్ ఇంటర్నేషనల్‌తో పాటు సుందర్ సి, నయనతార నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.  సుందర్ సి దర్శకత్వం వహిస్తున్నారు.  ఈ చిత్రంలో నయనతార ద్విపాత్రాభినయం చేస్తుండగా.. రెజీనా కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు.  నవంబర్ 6న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

అయితే ఇటీవ విడుదలైన ఈ మహాశక్తి ట్రైలర్ పై నెటిజన్లు ట్రోల్స్‌ చేస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ సరిగ్గా లేవని, బడ్జెట్ లేకపోవడంతో ఏఐ (AI) వాడేశారంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ వివాదంపై దర్శకుడు సుందర్ సి తీవ్రంగా స్పందించారు. చెన్నైలో జరిగిన ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌లో తనదైన శైలిలో స్పందించారు.

నిజం ఎంటో తెలుసుకోకుండా మాట్లాడితే..
‘నిజం ఎంటో తెలుసుకోకుండా మాట్లాడితే బాధగా అనిపిస్తుంది. దాదాపు 400 మంది సీజీఐ కళాకారులు రాత్రింబవళ్లు కష్టపడి ఏడాదిన్నర పాటు ఈ సినిమా కోసం పనిచేశారు. ఆ కష్టాన్ని ఏఐ పేరుతో కొట్టిపారేయడం సరైంది కాదు. ఈ సినిమాలో దాదాపు 3,000 సీజీఐ (CGI) షాట్లు ఉన్నాయి. అందులో కేవలం 15 షాట్లకు మాత్రమే ఏఐ ఉపయోగించాం. మిగిలిన ప్రతి ఫ్రేమ్‌ను సాంకేతిక నిపుణులే స్వయంగా తీర్చిదిద్దారు. విజువల్స్ బాగుంటే మెచ్చుకోండి, కానీ లేనిపోని ప్రచారాలు చేయకండి’ అని విజ్ఞప్తి చేశారు.

(ఇదీ చదవండి: మరో వివాదంలో ఆదర్శ కుటుంబం.. ఇలా చూపించారేంటి త్రివిక్రమ్ సార్?)

#

Tags : 1

Videos

తీవ్ర తుఫాన్ గా మారనున్న మురసు

లోకేష్.. బాబులను చూస్తుంటే బాధేస్తుంది..! మీ పని గొవిందా... గోవింద

మొత్తం దొంగ ఓట్లు..? రీ-పోలింగ్ కి ఛాన్స్..?

Raptadu Incident: బుల్లెట్ దిగింది

అమెరికాలో కుప్పకూలిన ప్రైవేట్ జెట్.. 9 మంది ప్రయాణికులు మృతి

2029 తరువాత మిమ్మల్ని కుక్కలు కూడా... పులివెందులలో దాడులపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

పులివెందుల నుంచి బయలుదేరిన వైఎస్ జగన్

స్ట్రాంగ్ రూమ్ లలో కరెంటు కట్ చేసి... వరుదు కళ్యాణి సంచలన కామెంట్స్

దూసుకొస్తున్న మురసు తుఫాన్.. మళ్లీ భారీ వర్షాలు

జగన్ కే ఎదురెళ్ళావ్.. ఒక్క సైగ చేస్తే పీస్ పీస్ అయిపోయేవాడివి.. దస్తగిరి ఓవర్ యాక్షన్..

Photos

+5

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (నవంబర్ 01 -నవంబర్ 07)

+5

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ సొంతం చేసుకున్న భార‌త్‌ (ఫోటోలు)

+5

వైట్‌ డ్రెస్‌లో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్.. (ఫోటోలు)

+5

ఎన్నికల్లో పచ్చ కుట్రలు.. ఆర్వో ఆఫీసు ఎదుట వైఎస్‌ జగన్‌ నిరసన (ఫోటోలు)

+5

చరణ్-సుకుమార్ కొత్త సినిమా లాంఛనంగా ప్రారంభం (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో సందడి సందడిగా హాలోవీన్‌ (ఫోటోలు)

+5

‘అక్క’ వెబ్‌సిరీస్‌ రిలీజ్... ట్రెండింగ్ హీరోయిన్ కీర్తి సురేశ్‌ (ఫోటోలు)

+5

40 ఏళ్లు దాటాయి అంటే ఎవరూ నమ్మరేమో! (ఫొటోలు)

+5

వరంగల్ :‌ నిట్‌లో సాంకేతిక మహోత్సవం టెక్నోజియాన్‌–26 ప్రారంభం (ఫోటోలు)