Breaking News

ఓ యువతి జీవితకథనే అన్నపూరణి..!

Published on Tue, 11/28/2023 - 07:34

లేడీ సూపర్‌స్టార్‌ నయనతార చిత్రంమంటే కచ్చితంగా ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ప్రస్తుతం ఆమె నటిస్తోన్న చిత్రం అన్నపూరణి. ఈ చిత్రం ద్వారా నీలేష్‌ కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.  ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని డిసెంబర్‌ ఒకటో తేదీ విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ మూవీ సంబంధించిన విశేషాలను దర్శకుడు పంచుకున్నారు. 

చిన్న వయస్సులోనే వంటలపై ఆసక్తి కలిగిన ఒక యువతి ఎలా ఆ రంగంలో విజయం సాధించింది అన్నదే అన్నపూరణి చిత్రమని దర్శకుడు నీలేష్‌ కృష్ణ తెలిపారు. ఆమె తన కుటుంబం, వారి సామాజికవర్గం పురుషాధిక్యతను ఎదుర్కొని ఎలా తన లక్ష్యాన్ని చేరుకుందన్నదే కథగా తెరకెక్కించినట్లు పేర్కొన్నారు. ఈ కథను కొన్నేళ్ల కిత్రమే నయనతారకు వినిపించారన్నారు. ఆమె ఆ సమయంలో యాక్షన్‌, థ్రిల్లర్‌, కమర్షియల్‌ కథా చిత్రాలు అధికంగా చేస్తున్నారని.. ఈ కథ వాటికి భిన్నంగా ఉందని చెప్పి నటించడానికి సంసిద్ధతను వ్యక్తం చేశారన్నారు.

అయితే ప్రస్తుతం తాను అంగీకరించిన చిత్రాలను పూర్తి చేసిన తర్వాతే చిత్రంలో నటించగలనని, అంతవరకు వేచి చూడగలరా అని అడిగారన్నారు. అలా నయనతార కోసం ఎదురుచూసి ఈ చిత్రాన్ని పూర్తి చేశామని చెప్పారు. మానవత్వం, ప్రేమ, ఆత్మవిశ్వాసం గురించి చెప్పే చిత్రంగా అన్నపూరిణి కథా చిత్రం ఉంటుందన్నారు. ఇది నయనతార ఇంతకుముందు నటించిన చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుందన్నారు. అంతే కాకుండా నలభీముల గౌరవాన్ని పెంచే చిత్రంగా ఉంటుందని అన్నారు. ఈ చిత్రంలో సత్యరాజ్‌, జయ్‌, కేఎస్‌ రవికుమార్‌, కుమారి సచ్చు, అచ్యుత్‌ కుమార్‌, రెడిన్‌ కింగ్స్‌ లీ, రేణుక, కార్తీక్‌ కుమార్‌, సురేష్‌ చక్రవర్తి ముఖ్యపాత్రలు పోషించారు. ఈ మూవీకి తమన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?