Breaking News

ఏ తప్పు చేయలేదు.. ఎందుకు భయపడాలి: నయనతార

Published on Thu, 12/12/2024 - 11:08

తప్పు చేయనప్పుడు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదంటోంది నయనతార. ధనుష్‌ విషయంలో తాను చేసిన పనిని సమర్థించుకుంటుంది. ఆయనతో మాట్లాడానికి చాలా ప్రయత్నించానని..కుదరకపోవడంతో లేఖ రాయాల్సి వచ్చిందని చెప్పింది. ‘నయనతార: బియాండ్‌ ది ఫెయిరీటేల్‌’ డాక్యూమెంటరీ విషయంలో ధనుష్‌, నయనతార మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. 

నయనతార జీవితాన్ని ఆధారంగా చేసుకొని తెరకెక్కించిన  ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్‌లో తన పర్మిషన్‌ తీసుకోకుండా  ‘నానుమ్‌ రౌడీ దాన్‌’లోని సీన్‌ను వాడుకున్నారంటూ చిత్ర నిర్మాత ధనుష్‌ లీగల్‌ నోటీసులు పంపించాడు. మూడు సెకన్ల క్లిప్‌నకు రూ.10 కోట్లు డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో నయనతార ధనుష్‌ క్యారెక్టర్‌ని తప్పుబడుతూ బహిరంగ లేఖను రాసింది. తాజాగా ఈ వివాదంపై నయనతార క్లారిటీ ఇచ్చింది. తాను లేఖను రాయడానికి గల కారణం ఏంటో తెలిపింది. 

(చదవండి: ఇక్కడితో ఆపేయండి..లేదంటే లీగల్‌ నోటీసులు పంపిస్తా.. సాయి పల్లవి మాస్‌ వార్నింగ్‌)

ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ వివాదం గురించి మాట్లాడుతూ.. ‘ధనుష్‌ క్యారెక్టర్‌ని బయట ప్రపంచానికి తెలియజేయడానికే ఆ లేఖను రాశాను. ‘న్యాయమని నమ్మిన దాన్ని బయటపెట్టడానికి నేను ఎందుకు భయపడాలి? తప్పు చేస్తే భయపడాలి. పబ్లిసిటీ కోసం ఎదుటి వ్యక్తుల పేరు ప్రతిష్ఠలను దెబ్బతీసే మనిషిని కాదు నేను. నా డ్యాక్యుమెంటరీ ఫిల్మ్‌ పబ్లిసిటీ కోసమే ఇదంతా చేశారని చాలా మంది మాట్లాడుతుంటున్నారు. అందులో ఏమాత్రం నిజం లేదు. 

(చదవండి: పుష్పరాజ్‌ వసూళ్ల సునామీ.. ఆరు రోజుల్లోనే రప్ఫాడించాడు!)

వీడియో క్లిప్స్‌కు సంబంధించిన ఎన్‌వోసీ కోసం ధనుష్‌ని కలిసేందుకు ప్రయత్నించాం. నేను, విఘ్నేష్‌ ఫోన్‌ చేశాం. కామన్‌ ఫ్రెండ్స్‌తో కూడా మాట్లాడించే ప్రయత్నం చేశాం. కానీ ధనుష్‌ స్పందించలేదు. ఆయన మమ్మల్ని ఎందుకు ద్వేషిస్తున్నారో తెలియదు. ముందు నుంచి మేమిద్దరం ఏమీ శత్రువులం కాదు. ఆయన నాకు మంచి స్నేహితుడే. ఈ పదేళ్లలో ఏం జరిగిందో తెలియదు. ఆయనకు మాపై ఎందుకు కోపం వచ్చిందనే విషయం కూడా మాకు అర్థం కావడం లేదు. పక్కవాళ్ల మాటలు విని మమ్మల్ని అపార్థం చేసుకున్నారా? ఇలాంటివి క్లియర్‌ చేసుకునేందుకు ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నించాను. అది కుదరలేదు’ అని నయనతార అన్నారు.
 

 

 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)