Breaking News

ప్రముఖ ఆలయంలో సాష్టాంగ నమస్కారాలు చేసిన నయనతార

Published on Sun, 07/06/2025 - 07:51

నటి నయనతార తన కుటుంబంతో పాటు పళని మురుగన్‌ను దర్శించుకున్నారు. అక్కడ ఆమె ప్రత్యేకమైన పూజలు నిర్వహించారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో ఉన్న పళనిస్వామి గుడికి కోలీవుడ్‌ హీరోలు ఎక్కువగా వెళ్తుంటారు. హీరో ధనుష్‌ ఎక్కువగా వెళ్లడం చూస్తుంటాం. శివకార్తికేయన్‌, విజయ్‌సేతుపతి, కార్తి వంటి స్టార్స్‌ ఈ ఆలయంలో పూజలు నిర్వహించారు. చెన్నైకి 400 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. మదురై నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

నయనతార తన భర్త విగ్నేష్, పిల్లలతో కలిసి తిరుమల, శ్రీకాళహస్తి వంటి ఆలయాలకు తరుచూ వెళ్తుంటుంది. అయితే, తాజాగా ఆమె పళని మురుగన్‌ (సుబ్రహ్మణ్యేశ్వరుడి )ని దర్శించుకుంది. ప్రత్యేకపూజలు అనంతరం సాష్టాంగ నమస్కారాలు చేస్తూ వారు కనిపించారు. ఫోటోలు షోషల్‌మీడియాలో వైరల్‌ కావడంతో అభిమానులు షేర్‌ చేస్తున్నారు.

ఆలయ ప్రత్యేకత
దేశంలోని ఏ విగ్రహమైనా రాయి లేదా లోహంతో మలిచినదే. కానీ ఇక్కడి స్వామి మూర్తిని తొమ్మిది రకాల విష పదార్థాలతో భోగర్‌ అనే సిద్ధుడు తయారుచేశాడట. అందుకే దీన్ని నవ పాషాణం అంటారు. గర్భగుడిలోని స్వామి పదేళ్ల బాలుడిగా చేతిలో దండం పట్టుకుని కౌపీనధారిగా దర్శనమిస్తాడు. ఈ విగ్రహం క్రీ.పూ.మూడువేల సంవత్సరాలనాటిదని చెబుతుంటారు. సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆరు దివ్య క్షేత్రాల్లో ఇది మూడోది కావడం విశేషం. ఇక్కడ ప్రసాదంగా ఇచ్చే పంచామృత  చాలా ప్రత్యేకం. ఈ క్షేత్రాన్ని దర్శించినవారికి జ్ఞానం సిద్ధిస్తుందనీ అలా శివుడు వరమిచ్చినట్లు అక్కడి భక్తులు చెబుతారు. సంతానప్రాప్తి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవాళ్లు ఎక్కువగా ఈ ఆలయాన్ని సందర్శిస్తారని స్థల పురాణం ఉంది. 
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)