Breaking News

ప్రభాస్‌ పెళ్లి తర్వాతే నేను చేసుకుంటా..: నవీన్‌ పొలిశెట్టి

Published on Fri, 01/02/2026 - 08:01

నవీన్‌ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటించిన చిత్రం 'అనగనగా ఒక రాజు'.. ఈ సంక్రాంతికి కడుపుబ్బా నవ్వించేందుకు జనవరి 14న వస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు.  నూతన దర్శకుడు కల్యాణ్‌ శంకర్‌ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. తాజాగా జరిగిన ఒక ఈవెంట్‌లో నవీన్‌ పొలిశెట్టి పలు వ్యాఖ్యలు చేశారు..  ఒకప్పుడు తాను ఏ హీరోల సినిమాలైతే థియేటర్‌కి వెళ్ళి చూసేవాడినో.. ఇప్పుడు ఆ అభిమాన హీరోల సినిమాలతో పాటు, తన సినిమా విడుదలవుతుండటం సంతోషంగా ఉందన్నారు.

ప్రభాస్‌ పెళ్లి తర్వాతే నేను చేసుకుంటా
'అనగనగా ఒక రాజు' సినిమా ప్రమోషన్స్‌ సందర్భంగా తన పెళ్లి గురించి నవీన్‌ పొలిశెట్టి ఇలా అన్నారు.  'ప్రభాస్‌ అన్నయ్య పెళ్లి చేసుకున్న మరుసటి రోజు 12 గంటలకు నా పెళ్లి ఉంటుంది.' అంటూ సరదాగా చెప్పారు. అయితే, ప్రభాస్‌ అన్నయ్యతో తన స్నేహం చాలా గొప్పదని ఆయన చెప్పుకొచ్చారు. గత మూడు సంవత్సరాల నుంచి ప్రతి సంక్రాంతికి భోగి మంటలు, పతంగ్‌లు, మీనాక్షి చౌదరి కామన్‌ అయిపోయిందన్నారు. ఏజెంట్‌ సాయి, జాతిరత్నాలు, మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి ఈ మూడు చిత్రాలు చాలా విభిన్నంగా ఉంటాయని గుర్తుచేశారు. ఇప్పుడు రాబోయే 'అనగనగా ఒక రాజు' కూడా సరికొత్తగా మెప్పిస్తుందని తెలిపారు.

ఫస్ట్‌ ప్రభాస్‌ సినిమా.. ఆ తర్వాత చిరు మూవీ వెళ్తా..
'ఈ సంక్రాంతికి విడుదలవుతున్న చిరంజీవి గారి 'మన శంకర వరప్రసాద్ గారు', ప్రభాస్ గారి 'ది రాజా సాబ్'తో పాటు అన్ని సినిమాలు విజయం సాధించాలని కోరుకుంటున్నాను..  ప్రభాస్‌ అన్నయ్య నేనూ మంచి స్నేహితులం.. మా మధ్య పోటీ ఉండదు. మెగాస్టార్‌ చిరంజీవి గారిని చూసి ఎంతో మంది స్ఫూర్తి పొందారు. సగటు మధ్యతరగతి కుటుంబం నుంచి కూడా ఎవరైనా సరే ఇండస్ట్రీలో స్టార్‌ అవ్వవచ్చని పలువురికి దారి చూపించిన వ్యక్తి ఆయన.. పరిశ్రమలో నాలాంటి వారికి ఎందరికో ఆయన దారిచూపించారు. అలాంటి గురువుగారి సినిమా వస్తుంటే ఎలాంటి ఒత్తిడి ఉండదు..  నేనైతే ఫస్ట్ ప్రభాస్ అన్నయ్య సినిమా చూసి..  ఆ తర్వాత చిరంజీవి గారి సినిమాకు వెళ్తాను. అటునుంచి నా సినిమాకు వెళ్తా.' అని నవీన్‌ పొలిశెట్టి అన్నారు.
 

Videos

Khammam : కాలువలో స్కూల్ బస్సు బోల్తా

Nizamabad : అంగవైకల్యం అడ్డస్తున్నా.. సంకల్ప బలం ఉంటే చాలు

కాకినాడ జిల్లా పిఠాపురంలో టీడీపీ, జనసేన పార్టీల మధ్య విభేదాలు

ఉల్లి పంటకు గిట్టుబాటు ధర దొరక్క తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన రైతులు

Anakapalli: రోడ్లు వేయాలంటూ పంచకర్ల రమేష్‌ను పట్టుబట్టిన స్థానికులు

Kannababu: చంద్రబాబు మాటలు కోటలు దాటుతాయి.. చేతలు ఇళ్లు దాటవు

జోగి రమేష్ భార్య, కుమారులకు నోటీసులు ఇచ్చిన పోలీసులు

Price Hikes: కొండెక్కిన చికెన్ ధర

Kakinada: YSRCP కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జ్

బ్యానర్ల ముసుగులో తనపై హత్యాయత్నం చేశారన్న గాలి జనార్దన్ రెడ్డి

Photos

+5

2025కి వీడ్కోలు.. పీవీ సింధు క్యూట్ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

నిర్మాత దిల్ రాజు ఫ్యామిలీ దుబాయి ట్రిప్ (ఫొటోలు)

+5

కొడుకుతో ట్రిప్ వేసిన వరుణ్ తేజ్-లావణ్య (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : ఈ గుహలో ఉన్న లక్ష్మీ నరసింహ ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

కొత్త ఏడాది జోష్‌..జనసంద్రమైన విశాఖ బీచ్ (ఫొటోలు)

+5

ప్రభాస్ ‘ది రాజా సాబ్’HD మూవీ స్టిల్స్‌

+5

కొత్త ఏడాది వేడుకలు.. తన ఉద్యోగులతో జరుపుకున్న అల్లు అర్జున్‌ (ఫోటోలు)

+5

న్యూ ఇయర్‌ ఎఫెక్ట్‌: బిర్లా మందిర్‌కు పోటెత్తిన భక్లులు (ఫోటోలు)

+5

కొత్త ఏడాది సెలబ్రేషన్స్‌లో మహేష్‌ బాబు ఫ్యామిలీ (ఫోటోలు)

+5

బీచ్‌లో భర్తతో కలిసి అనసూయ న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్ (ఫొటోలు)