Breaking News

కథే నా బలం: నవీన్‌ చంద్ర

Published on Mon, 05/12/2025 - 00:24

‘‘నవీన్‌ నాకంటే సీనియర్‌ నటుడు. అదృష్టాన్ని కాకుండా కషాన్ని మాత్రమే నమ్ముకున్న నవీన్‌ తన ప్రతి సినిమాలో బెస్ట్‌ పెర్ఫార్మెన్స్‌ ఇచ్చారు. ‘లెవన్‌’ సినిమా ట్రైలర్‌లో మంచి క్రాఫ్ట్‌ కనిపించింది. కథని, కంటెంట్‌ని నమ్ముకుని చేసిన సినిమా ఇది. ఈ సినిమాతో నవీన్‌కి ఒక మంచి హిట్‌ రావాలని కోరుకుంటున్నాను’’ అని సందీప్‌ కిషన్‌ అన్నారు. నవీన్‌ చంద్ర హీరోగా నటించిన ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ మూవీ ‘లెవన్‌’. ఈ ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రాన్ని లోకేశ్‌ అజ్లస్‌ దర్శకత్వంలో అజ్మల్‌ ఖాన్, రేయా హరి నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 16న విడుదల కానుంది.

రుచిర ఎంటర్టైన్మెంట్స్‌ డిస్ట్రిబ్యూటర్‌ ఎన్‌. సుధాకర్‌ రెడ్డి ఈ సినిమా థియేట్రికల్‌ హక్కులను సొంతం చేసుకున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా నటుడు–నిర్మాత సందీప్‌ కిషన్, అతిథులుగా దర్శకులు కరుణకుమార్, విశ్వనాథ్, అనిల్‌ విశ్వనాథ్, సాయిరాజేశ్, శ్రీకాంత్‌ పాల్గొన్నారు. ఈ వేడుకలో నవీన్‌ చంద్ర మాట్లాడుతూ– ‘‘ఇప్పటివరకు ఈ సినిమా చూసిన వారు బాగుందని చెప్పారు. 

వాళ్ల రియాక్షన్స్‌ చూసినప్పుడు నా ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. నా కథే నా బలం. నేను చేసే కథలు, పాత్రలు బాగుంటాయని ప్రేక్షకులు మొదట్నుంచి ప్రశంసిస్తున్నారు. ఈ గౌరవానికి రిటర్న్‌గా ఈ సినిమా ఉంటుందని నమ్ముతున్నాను. ఈ సినిమాలో ఉన్న యునిక్‌ కాన్సెప్ట్‌ని ఇప్పటివరకు ఏ థ్రిల్లర్‌మూవీలోనూ చూసి ఉండరు. ఈ సినిమా టైటిల్‌లోనే చాలా క్లూస్‌ ఉన్నాయి. ఎవరైనా ఆ క్లూస్‌ని డీకోడ్‌  చేస్తే వాళ్ళకి చాలా మంచి గిఫ్ట్‌ ఇస్తాను’’ అని తెలిపారు. ‘‘ఓ సినిమాకి సరైన నటీనటులు కుదిరితే, ఆ సినిమా సగం గెలిచినట్లే. అలా ‘లెవన్‌’ సినిమా సగం గెలిచింది. ఈ సినిమాను థియేటర్స్‌లో చూడండి’’ అని తెలిపారు లోకేశ్‌.

Videos

వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కార్యక్రమంలో రికార్డింగ్ డ్యాన్సులు.. వీడియో వైరల్..!

LIVE: YSRకు జగన్ నివాళులు

దిగొచ్చిన గోల్డ్ భారీగా తగ్గిన బంగారం.. వెండి

ఇరుముడి OTTలోకి ఎప్పుడు.?

లోకల్ ఎన్నికల్లో భారీ విజయం జగన్ దిశానిర్దేశం

Kapra Lake: గణేష్ విగ్రహాల నిమజ్జనంపై వివాదం..

తెనాలిలో వ్యాపారి కిడ్నాప్ కేసు విషాదాంతం

చంద్రబాబుకు బిగ్ షాక్.. సుప్రీంకోర్టు హెచ్చరిక

సభలో అందరిముందు జనసేన గాలి తీసిన బాబు..

Idupulapaya: YSR ఘాట్‌ వద్ద జగన్‌ నివాళులు

Photos

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)

+5

ఇలా మెరిసిపోతే ఎలా కాయదు? (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో ఆకాశ వంతెన (స్కైవాక్)...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

పులివెందుల : భాకరాపురం క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ ప్రజాదర్బార్‌ (ఫొటోలు)

+5

‘మిర్జాపూర్‌ : ది మూవీ’ తెలుగు ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)