Breaking News

మాయగాడు మూవీ రివ్యూ

Published on Fri, 02/03/2023 - 21:30

టైటిల్: మాయగాడు 

నటీనటులు: నవీన్ చంద్ర, పూజా ఝావేరి, గాయత్రి సురేష్,  అభిమన్యు సింగ్, కబీర్ దుహన్ సింగ్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్: అనూప్ రూబెన్స్ 

సినిమాటోగ్రాఫర్: వెంకట్ గంగాధరి 

ఎడిటర్: జునైద్ సిద్దిఖ్ 

నిర్మాత: భార్గవ్ మన్నె 

రచన, దర్శకత్వం: జి కార్తిక్ రెడ్డి 

విడుదల తేదీ: 03-02-2023

నవీన్ చంద్ర, పూజా ఝావేరి, గాయత్రీ సురేష్ హీరో హీరోయిన్స్‌గా అడ్డా ఫేం జీ.ఎస్.కార్తీక్ రెడ్డి డైరెక్షన్‌లో తెరకెక్కిన సినిమా ‘మాయగాడు’. స్వాతి పిక్చర్స్ బ్యానర్‌పై భార్గవ్ మన్నె ఈ చిత్రాన్ని నిర్మించారు. పైరసీ బ్యాక్ డ్రాప్‌లో రూపొందిన లవ్ స్టోరీ ఇది. ఈ రోజు రీలిజ్ అయ్యిన ఈ చిత్రం ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం. 

అసలు కథేంటంటే:
కాకినాడలో రవి(నవీన్ చంద్ర) అనే వ్యక్తి సినిమాలని పైరసీ చేసే ఒక సీడీల షాప్ ఓనర్. ఆకతాయిగా అమ్మాయిలతో తిరిగే ఒక ప్లే బాయ్ క్యారెక్టర్. పైరసీ చేస్తున్నాడన్న విషయం తెలుసుకున్న సిరి(గాయత్రి సురేష్) రవిని పోలీసులకి పట్టిస్తుంది. హీరో అప్పటి నుంచి సిరి వెనక పడుతుంటాడు. ప్లే బాయ్‌గా తిరిగే రవి(నవీన్ చంద్ర) లవ్‌లో సిరి ఎలా పడింది? మరి పూజా ఝావేరికి నవీన్ చంద్రకి సంబంధం ఏంటి? పూజా ఝావేరి అన్నయ్య యాంటోని(అభిమన్యు సింగ్) నవీన్ చంద్రని ఎందుకు చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు? అసలు పైరసీ ఆగిందా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

కథ ఎలా ఉందంటే..

ఫస్ట్ హాఫ్ ఓపినింగ్‌లో నవీన్ చంద్ర ఫ్లాష్ బ్యాక్‌కు వెళ్తాడు. సినిమా రిలీజ్ తరువాత పైరసీ చేసి  డబ్బులు సంపాదిస్తూ తిరిగే ఒక ప్లే బాయ్ క్యారెక్టర్. కాకపోతే, ప్లే బాయ్‌గా చూపించే క్యారెక్టర్‌లో కొన్ని సీన్స్ సాగదీతగా అనిపిస్తాయి. తన ఫ్రెండ్ గీత పెళ్లి మ్యాచెస్ కోసం కాకినాడకి వచ్చిన సిరి.. పైరసీ చేస్తున్న నవీన్ చంద్రకి బుద్ధి చెప్పే ప్రయత్నంలో అతని వలలో చిక్కుకుంటుంది. అదే టైంలో పూజా ఝావేరి నవీన్ చంద్రకి పరిచయమవ్వుతుంది. తన అన్నయ్య ఒక కిల్లర్ అని చెప్పిన పట్టించుకోకుండా ఆమె చుట్టూ తిరుగుతాడు. ఒక రోజు యాంటోని(అభిమన్యు సింగ్) తన చెల్లితో రొమాన్స్ చేస్తున్నప్పుడు పట్టుకోవడానికి ప్రయత్నం చేయగా పారిపోతాడు. వీళ్లిద్దరి మధ్య సీన్స్ నిడివి తక్కువే అయ్యిన పర్వాలేదు అనిపిస్తాయి. సినిమాలో వచ్చే సాంగ్స్ ఏ మాత్రం ఆకట్టుకోవు. ఒక బలమైన సీక్వెన్స్‌లో నవీన్ చంద్ర అండ్ గాయత్రి సురేశ్ ఇద్దరు బాగా దగ్గరవ్వతున్న సమయంలో బ్రేకప్‌తో ఫస్టాప్ ముగుస్తుంది. 

సెకండ్ ఆఫ్ వచ్చేసరికి ప్లే బాయ్ కాస్త లవర్ బాయ్‌లా మారిపోతాడు. అయితే కొన్ని సీన్స్‌లో ఎమోషన్స్ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకునేలా లేవు. అభిమన్యు సింగ్ కామెడీ కాస్తా నవ్విస్తుంది. క్లైమాక్స్ పైరసీ కోసం ఫ్యాన్స్‌తో పోరాటం చేసిన తీరు బాగున్నప్పటికీ అంతగా మెప్పించలేదు. సినిమాలో కథ, డైలాగ్స్ మీద దర్శకుడు ఇంకాస్త దృష్టి సారిస్తే బాగుండేది. 

ఎవరెలా చేశారంటే:

నవీన్ చంద్ర ఏ పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోతాడు. ఈ సినిమాలో ఆకతాయి కుర్రాడిలా ఆకట్టుకున్నాడు. పూజా ఝావేరి యాక్టింగ్‌తో పాటు తన అందచందాలతో సూపర్ అనిపించింది. గాయత్రి సురేశ్ తన పాత్ర లో చక్కగా ఓదిగిపోయింది. అభిమన్యు సింగ్ పాత్ర మునుపెన్నడూ చూడని విధంగా ఒక మెంటల్ కిల్లర్‌లా అద్భుతంగా రాణించారు. ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించిన కబీర్ దుహన్ సింగ్ పాత్ర ఫ్యాన్స్‌ను మెప్పించింది. మిగిలి వారు తమ పాత్రలకు న్యాయం చేశారు. దర్శకుడు జి. కార్తిక్ రెడ్డి పాత్రల ఎంపిక విషయంలో బాగానే ఉన్నా..  కథపై ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. కథలో కొత్తదనం లేకపోవడం మైనస్. జునైద్ సిద్దిఖ్ ఎడిటింగ్ పనితీరు బాగుంది. వెంకట్ గంగాధరి సినిమాటోగ్రాఫి సినిమా స్థాయి పెంచింది. అనూప్ రూబెన్స్ సంగీతం బాగుంది. చిత్రనిర్మాణ సంస్థ నిర్మాణ విలువలు ఫర్వాలేదు

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)