Breaking News

నరేశ్‌కు పవిత్ర దగ్గరవ్వడానికి కారణం అదే: రమ్య

Published on Mon, 01/16/2023 - 21:34

సినీ నటుడు నరేశ్‌ కొంతకాలంగా తన మూడో భార్య రమ్య రఘుపతికి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా నటి పవిత్రా లోకేశ్‌కు దగ్గరైన ఆయన ఆమెను పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. ఈ ఏడాది న్యూ ఇయర్ సందర్భంగా ఓ వీడియోను విడుదల చేసిన జంట మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా ఓ ఛానెల్‌ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు. 

రమ్య మాట్లాడుతూ..' నరేశ్ డివోర్స్ కావాలని పిటిషన్ వేశారు. అదే నాకు పెద్ద ఆధారం. నేను కూడా అలిగేషన్స్ వేశా. నేను ఏం అలిగేషన్స్ వేశానో ఆధారాలు ఉన్నాయి. ఆరు నెలలైనా ఇంతవరకు నాపై చేసినా ఆరోపణలు నిరూపించలేకపోయారు. డివోర్స్ కేసు కోర్టులో ఉండగా మాట్లాడటం సరికాదు. చైల్డ్ గార‍్డియన్ షిప్, నా మీద ఇంజక్షన్ ఆర్డర్ ఫైల్ చేశారు. నాపై రకరకాలుగా కేసులు వేశారు. నేను వీటన్నింటినీ ఎదుర్కొంటున్నా. నేను వేసిన ఒకే ఒక కేసు డొమెస్టిక్ వయోలెన్స్.  నాకు, నా కుమారుడికి మెయింటనెన్స్ కావాలని వేశా. నా మీద ఆరోపణలు చాలా వచ్చాయి. ఆస్తి కోసం ఆమె ఇలా చేస్తోంది అని అన్నారు. నాకు నా పిల్లాడి జీవితం ముఖ్యం. అందుకే పోరాటం చేయడానికి నిర్ణయించుకున్నా. ఫైనల్‌గా నాకు విడాకులు వద్దనేదే నా నిర్ణయం.' అని అన్నారు. 

ఇటీవల వీడియోపై ఆమె మాట్లాడుతూ..' ఒక భార్యగా ఆయన నన్ను టీజ్ చేస్తున్నారు. ఆ వీడియోను రెండుసార్లు మాత్రమే చూశా. నా బాబుకు సెక్యూరిటీ ఇవ్వడమే నా లక్ష‍్యం. నేను ఎక్కడా తప్పు చేయలేదు. అలాంటప్పుడు నాపై నిందలు వేస్తే సహించను. నరేశ్ దగ్గరికి పవిత్ర రావడానికి కేవలం ఆర్థిక పరమైన కారణాలే. నరేశ్‌ను ఎవరితోనైనా ఉన్నప్పుడు నేను పట్టుకుంటే రెండు నెలలు నాతో బాగా ఉంటారు. ఆ సమయంలో ఇంట్లో అడిగేవారు ఎవరూ లేకపోవడంతో పవిత్ర దగ్గరైంది. గతంలో కూడా ఆయనకు ఎఫైర్స్ ఉండేవి. మా అత్త నాకు సర్ది చెప్పేవారు. నరేశ్ ఎప్పటికైనా మారుతారని చెప్పేది.  ఆయన ఎలాంటి వారనేది మా ఫ్యామిలీకి చెప్పలేదు. నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నా. ఇది పూర్తిగా నా సమస్య. నా కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదు. నేను ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకున్నా. న్యాయస్థానంలోనే తేల్చుకుంటా.' అని రమ్య రఘుపతి అన్నారు. 

 

Videos

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)