Breaking News

ఇంటర్వెల్‌ చూసి షాక్‌ అవుతారు 

Published on Thu, 12/18/2025 - 03:49

‘‘మా డైరెక్టర్‌ మురళీ మనోహర్‌ చెప్పిన ‘గుర్రం పాపిరెడ్డి’ కథ బాగా నచ్చింది. నేను గతంలో నటించిన చిత్రాల్లో నా క్యారెక్టర్స్‌ సెటిల్డ్‌గా ఉంటాయి. అయితే ‘గుర్రం పాపిరెడ్డి’లో నా పాత్ర కొంచెం ఎనర్జిటిక్‌గా నేనే లీడ్‌ తీసుకునేలా ఉంటుంది. ఇప్పటివరకూ నేను ఇలాంటి మూవీ చేయలేదు. మా సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది’’ అని నరేశ్‌ అగస్త్య తెలిపారు. ఆయన హీరోగా ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘గుర్రం పాపిరెడ్డి’. 

బ్రహ్మానందం, యోగిబాబు ఇతర పాత్రలు పోషించారు. మురళీ మనోహర్‌ దర్శకత్వంలో డా. సంధ్య గోలీ సమర్పణలో వేణు సద్ది, అమర్‌ బురా, జయకాంత్‌ (బాబీ) నిర్మించిన ఈ మూవీ ఈ నెల 19న రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా నరేశ్‌ అగస్త్య విలేకరులతో మాట్లాడుతూ–‘‘ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే ఎదుటివాళ్లకు నవ్వొస్తుంది. అదే డార్క్‌ కామెడీ. 

‘గుర్రం పాపిరెడ్డి’ లోని పాత్రలు ఇబ్బంది పడుతుంటే ప్రేక్షకులు నవ్వుకునేలా ఉంటాయి. సన్నివేశాలు వినోదంతో వెళుతున్నా బలమైన కథ ఉంటుంది. ఇంటర్వెల్‌ చూసి ఆడియన్స్‌ షాక్‌ అవుతారు. ఈ చిత్రంలో నేనొక పని కోసం వస్తాను. ఆ పని చేసేందుకు నాకు తెలిసిన వాళ్లలో కొందరు తెలివిలేని వాళ్లను సెలెక్ట్‌ చేసుకుంటాను. తెలివైనవాడు తెలివితక్కువ పని చేస్తే, తెలివి లేని వాళ్లు తెలివైన పని చేస్తే వాళ్ల జీవితాల్లో వచ్చిన పరిణామాలు ఏంటి? అనేది కథ. 

నాకు ట్రావెలింగ్‌ అంటే ఇష్టం. ఫ్రీ డైవింగ్‌ చేస్తుంటా. అంటే ఒక్కసారి ఊపిరి పీల్చి సముద్రంలో ఎంత లోతు వెళ్లగలమో అంత లోతు వెళ్లాలి. ఇప్పటివరకు సముద్రంలో 3 నిమిషాల 40 సెకండ్స్‌లో 80 అడుగుల లోతుకు వెళ్లాను. ఇక నేను హీరోగా నటిస్తున్న ఓ తెలుగు సినిమా 70 శాతం షూటింగ్‌ పూర్తి అయింది. తమిళంలో హీరోగా ఓ చిత్రం ఒప్పుకున్నాను’’ అని చె΄్పారు.

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)