Breaking News

‘హిట్‌ 3’లోని వయెలెన్స్‌ని ఎంజాయ్‌ చేస్తారు: నాని

Published on Thu, 05/01/2025 - 15:57

‘‘హిట్‌ ఫ్రాంచైజీలో వచ్చిన ‘హిట్‌: ది ఫస్ట్‌ కేస్, హిట్‌: ది సెకండ్‌ కేస్‌’ రెండూ కూడా ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్స్‌. ‘హిట్‌: 3’లో యాక్షన్, వయొలెన్స్‌ కథ డిమాండ్‌ని బట్టి వచ్చాయి. ఇది రెగ్యులర్‌ సినిమాల్లా ఉండదు. సహజంగా కుదిరిన కొన్ని అంశాలు విజిల్స్‌ వేయించేలా ఉంటాయి’’ అని హీరో నాని చెప్పారు. శైలేష్‌ కొలను దర్శకత్వంలో నాని, శ్రీనిధీ శెట్టి జంటగా నటించిన చిత్రం ‘హిట్‌: ది థర్డ్‌ కేస్‌’. యునానిమస్‌ ప్రొడక్షన్స్‌తో కలిసి వాల్‌ పోస్టర్‌ సినిమాపై ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ సినిమా నేడు పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలైంది. ఈ సందర్భంగా నాని పంచుకున్న విశేషాలు.

‘హిట్‌ 3’ షూటింగ్‌ కోసం దేశమంతా తిరిగాం. అలాగే ప్రమోషన్స్‌ కోసం కూడా దేశం మొత్తం తిరిగాం... ఆడియన్స్‌ నుంచి మంచి స్పందన వచ్చింది. ‘హిట్‌ 3’ చూడాలని వారు ఫిక్స్‌ అయిపోయారు. సినిమా విడుదల కాక ముందే అలాంటి ఒక ΄పాజిటివ్‌ వైబ్‌ రావడం చాలా హ్యాపీగా ఉంది. ఈ చిత్రంలోని వయొలెన్స్‌ డిస్ట్రబ్‌ చేసేలా ఉండదు. ‘సలార్‌’ సినిమాలోని యాక్షన్‌ని ఎంజాయ్‌ చేసినట్లు ‘హిట్‌ 3’ యాక్షన్‌ని కూడా ఎంజాయ్‌ చేస్తారు. చిన్నపిల్లలు ఈ సినిమా చూడొద్దనే ‘ఎ’ సర్టిఫికెట్‌ ఇచ్చారు. నా కొడుక్కి కూడా ఈ మూవీ చూపించను. ఈ సినిమా నేనే చేయడానికి కారణం ఏంటి? అనేది సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులకే అర్థం అవుతుందని భావిస్తున్నాను.

వయొలెంట్‌ సినిమాలు చేయడాన్ని నేను ట్రాన్స్‌ఫర్మేషన్‌గా చూడటం లేదు. ప్రతి సినిమానీ కొత్త జానర్‌లో చేయాలని ప్రయత్నం చేస్తాను. ‘జెర్సీ, హాయ్‌ నాన్న, దసరా’... ఇప్పుడు ‘హిట్‌ 3’... ఇవన్నీ వైవిధ్యమైన జానర్లలో చేసిన సినిమాలే. ‘హిట్‌ 3’ వైవిధ్యమైన జానర్‌ సినిమా. అన్ని వర్గాలు అని కాకుండా ఓ వర్గం ప్రేక్షకులను మెప్పించినా కచ్చితంగా సినిమా బ్లాక్‌ బస్టర్‌ అవుతుంది. నేను నా పనిని చాలా ఎంజాయ్‌ చేస్తాను. అందుకే నాకు రా అండ్‌ ఇంటెన్స్‌ క్యారెక్టర్స్‌ చేయడం కష్టంగా అనిపించదు.  

శైలేష్‌ కొలను ‘హిట్‌’ లాంటి ఇంటెన్స్‌ యాక్షన్‌ సినిమాలు తీస్తున్నాడు కానీ, తన మాటల్లోనే జోకులు పేలిపోతుంటాయి. తనకి ఒక మంచి కామెడీ స్క్రిప్ట్‌ రాయమని చెప్పాను. ఈ మధ్య ప్రేక్షకులు థియేటర్స్‌కి రావడం లేదని తరచుగా వింటున్నాం. ఆ మాట తప్పు. వారిని థియేటర్లకు రప్పించే కంటెంట్‌తో సినిమాలు తీయడం మేకర్స్‌ బాధ్యత. ‘హిట్‌ 3’ అడ్వాన్స్‌ టికెట్‌ బుకింగ్స్‌ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. 

మన సినిమా మాత్రమే హిట్‌ కావాలనుకోవడం తప్పు. అన్ని సినిమాలు బాగా ఆడితేనే మన సినిమా ఇంకా బాగా ఆడుతుంది. ఇండస్ట్రీలోని వారందరూ అన్ని సినిమాలూ హిట్టవ్వాలని కోరుకోవాలి.. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుంది. ఇక చిరంజీవిగారి అభిమాని అయిన నేను ఆయనతో సినిమా నిర్మించనున్నానంటే ఇంకా జీర్ణించుకోలేకపోతున్నా (నవ్వుతూ).. ఇదొక ప్రౌడ్‌ మూమెంట్‌. శ్రీకాంత్‌ ఓదెల చెప్పిన కథ చిరంజీవిగారికి నచ్చడంతో ఆయన చేసేందుకు ఒప్పుకున్నారు. నా తర్వాతి సినిమా ‘ప్యారడైజ్‌’ కూడా సరికొత్త కథాంశంతో ఉంటుంది.   
 

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)