Breaking News

నాని 'సరిపోదా శనివారం' గ్లింప్స్‌ విడుదల.. టైటిల్‌ సీక్రెట్‌ ఇదే

Published on Sat, 02/24/2024 - 13:14

నాని హీరోగా వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో ‘సరిపోదా శనివారం’ పాన్‌ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతోంది. 'అంటే సుందరానికీ' సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో  ఈ సినిమా తెరకెక్కుతుంది.  ప్రియాంకా అరుళ్‌ మోహనన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ఎస్‌జే సూర్య ఓ కీలక పాత్రలో పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై డీవీవీ దానయ్య ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాడు. ఆగష్టు 29న  ఈ చిత్రం విడుదల కానుంది.

నేడు నాని పుట్టినరోజు సందర్భంగా ‘సరిపోదా శనివారం’ మూవీ నుంచి గ్లింప్స్‌ను విడుదల చేశారు మేకర్స్‌.. ఇందులో నాని యాంగ్రీమెన్‌లా కనిపిస్తున్నాడు. ఎస్‌ జే సూర్య వాయిస్‌తో గ్లింప్స్‌ ప్రారంభం అవుతుంది. వారం మొత్తంలో శనివారం మాత్రమే హీరో నానిలో కోపం కట్టలు తెంచుకుంటుంది. దీనినే ఈ గ్లింప్స్‌లో చూపించారు.

వారంలో అన్ని రోజుల్లో సాదాసీదాగా ఉంటూ.. శనివారం మాత్రమే శక్తిమంతుడిగా కనిపించే హీరో కథగా ఈ మూవీ ఉండనుంది. యాక్షన్‌కు.. వినోదానికి ఇందులో పెద్ద పీట వేసినట్లు తెలుస్తోంది. నాని క్యారెక్టర్ డిజైన్ చాలా ఫ్రెష్ గా ఉంది. గ్లింప్స్‌లో డైలాగ్స్ లేకపోయినా అతని స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా ఉంది. నాని సిగరెట్ తాగే విధానం పాత్రకు చైతన్యాన్ని తెస్తుంది.  వెనుక సీటులో అజయ్ ఘోష్ కూర్చొని ఉండగా నాని రిక్షా తొక్కే సన్నివేశం మెచ్చుకోదగినది. గ్లింప్స్‌తో ఫ్యాన్స్‌ను నాని మెప్పించాడని చెప్పవచ్చు.

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

కృష్ణాష్టమి సెలబ్రేషన్.. కిరణ్ అబ్బవరం కొడుకు ఇలా (ఫొటోలు

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)