Breaking News

సల్మాన్‌ ‘సౌత్‌’ వ్యాఖ్యలపై స్పందించిన నాని!

Published on Tue, 04/29/2025 - 12:47

‘దక్షిణాది అభిమానులు మాపై(బాలీవుడ్‌ హీరోలు) చూపిస్తున్న ప్రేమను థియేటర్‌ వరకు తీసుకెళ్లరు’ అని బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan) చేసిన వ్యాఖ్యలు ఇటీవల చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వ్యాఖ్యలపై టాలీవుడ్‌ హీరో నాని(Nani) స్పందిస్తూ..బాలీవుడ్‌ చిత్రాలను దక్షిణాది ప్రేక్షకులు తరతరాలుగా ఆదరిస్తున్నారని గుర్తు చేశారు. ఒకవేళ వారంతా నిజంగానే ఆదరించరనేదే నిజమైతే వాళ్లు(బాలీవుడ్‌ హీరోలు) సూపర్‌ స్టార్స్‌ ఎలా అయ్యారని ప్రశ్నించారు. 

‘దక్షిణాది చిత్రాలు ఈ మధ్యకాలంలో ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపును తెచ్చుకుంటున్నాయి. కానీ అంతకంటే ముందు హిందీ చిత్రాలను అందరూ ఆదరించారు. ఎన్నో దశాబ్దాలుగా సౌత్‌ ఆడియన్స్‌ బాలీవుడ్‌ సినిమాలపై ఆదరాభిమానాలు చూపిస్తూనే ఉన్నారు. బాలీవుడ్‌ హీరోలకు ఇక్కడ పెద్ద ఎత్తున ఫ్యాన్స్‌ ఉన్నారు. అమితాబ్‌ నటించిన ఎన్నో చిత్రాలు సౌత్‌లో సూపర్‌ హిట్‌గా నిలిచాయి. సల్మాన్‌ ఖాన్‌కు ఇక్కడ(సౌత్‌) చాలా మంది అభిమానులు ఉన్నారు.

‘హమ్‌ ఆప్‌కే హై కౌన్‌’ సినిమా నాకు చాలా ఇష్టం. ‘దీదీ తేరా దీవానా’ పాట ఇక్కడి పెళ్లిళ్లలో ఎన్నోసార్లు విన్నాం. ఆయన నటించిన చిత్రాలెన్నో ఇక్కడ భారీ విజయాన్ని అందుకున్నాయి.  అందరూ ఆదరించారు కాబట్టే వాళ్లు సూపర్‌ స్టార్స్‌ అయ్యారు. బహుశా సల్మాన్‌ వ్యాఖ్యలను మనం తప్పుగా అర్థం చేసుకున్నామేమో. బాలీవుడ్‌ సినిమాలకు సౌత్‌లో మంచి ఆదరణ ఉంటుంది’ అని నాని చెప్పుకొచ్చారు. 

కాగా, సికిందర్‌ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో సల్మాన్‌ మాట్లాడుతూ.. ‘సౌత్‌ హీరోల సినిమాలు బాలీవుడ్‌లో మంచి విజయం సాధిస్తున్నాయి. రజనీకాంత్‌, చిరంజీవి, సూర్య, రామ్‌ చరణ్‌ లాంటి హీరోల సినిమాలు అక్కడ(బాలీవుడ్‌) మంచి వసూళ్లను రాబడుతున్నాయి. ఎందుకంటే వారి సినిమాను మేమంతా థియేటర్స్‌కి వెళ్లి చూస్తాం. కానీ వారి అభిమానులు మాత్రం మా(హిందీ )సినిమాలు చూడడానికి అంతగా ఆసక్తి చూపించరు. నేను రోడ్లపై కనిపిస్తే..‘భాయ్‌..భాయ్‌’ అంటూ ప్రేమను చూపిస్తారు కానీ..అదే ప్రేమతో థియేటర్స్‌కి వెళ్లి సినిమా చూడరు’ అని అన్నారు.  

ఇక నాని సినిమాల విషయానికొస్తే.. ఆయన హీరోగా నటించిన ‘హిట్‌ 3’(HIT 3) మే 1న విడుదల కాబోతుంది. ‘హిట్‌’ ఫ్రాంచైజీలో భాగంగా రూపొందిన ఈ మూడో సినిమా ఇది. శైలేష్‌ కొలను దర్శకుడు. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది. 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)