Breaking News

సీతారామం తర్వాత నాకు వచ్చిన ఫస్ట్‌ ఫోన్‌కాల్‌ తనదే: హీరో

Published on Mon, 05/15/2023 - 00:52

‘‘అన్నీ మంచి శకునములే..’ ట్రైలర్, టీజర్‌లో పాజటివ్‌ ఎనర్జీ కనిపించింది. ఈ సినిమాకు ‘అన్నీ మంచి శకునములే..’. ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌ అవుతుందని నమ్ముతున్నా’’ అని అన్నారు నాని. సంతోష్‌ శోభన్ , మాళవికా నాయర్‌ జంటగా నందినీరెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అన్నీ మంచి శకునములే’. మిత్రవిందా మూవీస్, స్వప్నా సినిమాస్‌పై ప్రియాంకా దత్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది.

ఈ సందర్భంగా ఆదివారం జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు హీరోలు నాని, దుల్కర్‌ సల్మాన్ అతిథులుగా హాజరయ్యారు. ఈ వేడుకలో నాని ఇంకా మాట్లాడుతూ– ‘‘మంచి ఈజ్, బ్రహ్మాండమైన కామెడీ టైమింగ్‌ ఉన్న యాక్టర్‌ సంతోష్‌. అతన్ని చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్లుగా అనిపిస్తోంది. నందినీకి మరో నాని దొరికాడనిపిస్తోంది. ‘అన్నీ మంచి శకునములే’కి విజువల్స్, సాంగ్స్, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ బాగా కుదిరినట్లు అనిపిస్తోంది.

ప్రేక్షకులందరికీ గుర్తుండిపోయే ఓ స్పెషల్‌ చిత్రంగా నిలుస్తుందని నమ్ముతున్నాను’’ అన్నారు నాని. దుల్కర్‌ సల్మాన్ మాట్లాడుతూ– ‘‘వైజయంతీ మూవీస్‌ నాకు ఓ ఫ్యామిలీలాంటిది. రాజేంద్రప్రసాద్‌గారికి నేను అభిమానిని. ‘మహానటి’కి ఆయనతో కలిసి వర్క్‌ చేశాను. ‘సీతారామం’ తర్వాత నాకు తొలి ఫోన్ కాల్‌ నందినీ రెడ్డిగారి నుంచి వచ్చింది. ‘అన్నీ మంచి శకునములే’ సినిమా విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘నా లైఫ్‌లో నేను చేసిన పెద్ద సినిమా ఇది.

వీకే నరేశ్, రాజేంద్రప్రసాద్, గౌతమీ, వాసుకి, ‘షావుకారు’ జానకి, అంజు.. ఇలా వీరందరూ కలిసి నేను రాసుకున్న కథను పది రెట్లు పెంచారు. ఈ సినిమాకు లైఫ్‌ లైన్  సంగీత దర్శకులు మిక్కీ జే మేయర్‌. ఫ్యామిలీ ప్రొడ్యూసర్స్‌తో కలిసి వర్క్‌ చేసిన ఫీలింగ్‌ ప్రియాంక, స్వప్నాల వల్ల కలిగింది’’ అన్నారు నందినీ రెడ్డి. ‘‘సమ్మర్‌కు మన అమ్మమ్మగారి ఇంటికి వెళ్లొచ్చిన జ్ఞాపకంలా ‘అన్నీ మంచి శకునములే’ ఉంటుంది’’ అన్నారు స్వప్నా దత్, ప్రియాంకా దత్‌.

‘‘చాలాకాలం ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయే చిత్రమిది’’ అన్నారు సంతోష్‌ శోభన్.. ‘‘వైజయంతీ మూవీస్‌ సంస్థను మా పిల్లలు (స్వప్నా, ప్రియాంక) సక్సెస్‌ఫుల్‌గా రన్  చేస్తున్నారు. వీరి ఆలోచనలు అప్పట్లో నాకు రాలేదని ఈర్ష్యగా ఉంది’’ అన్నారు నిర్మాత అశ్వినీదత్‌. ‘‘అసలు మనం ఎందుకు పుట్టాం? హిందూ ధర్మంలో మనం సెంటిమెంట్‌కు ఎంత వేల్యూ ఇస్తాం.

ఆ సెంటిమెంట్‌ వల్ల మనం ఎలా ఉన్నాం? వంటి అంశాలు ‘అన్నీ మంచి శకునములే..’లో ఉన్నాయి. ఒక అద్భుత  సినిమాను చూసిన అనుభూతిని ప్రేక్షకులకు ఇస్తుందని గ్యారంటీ ఇస్తున్నాను’’ అన్నారు రాజేంద్రప్రసాద్‌. ‘‘పదహారు కూరల రుచుల సమ్మేళనం ఈ చిత్రం’’ అన్నారు వీకే నరేశ్‌. ఈ వేడుకలో దర్శకులు నాగ్‌ అశ్విన్, హను రాఘవపూడి, అనుదీప్‌ తదితరులు పాల్గొన్నారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)