Breaking News

Telugu Indian Idol 2: ఇండియన్‌ ఐడల్‌ 2 షోలో నాని సందడి

Published on Tue, 04/04/2023 - 16:19

దసరా సినిమాతో పాన్‌ ఇండియా రేంజ్‌లో దుమ్మురేపుతున్నారు నాని. అదే జోష్‌తో ఆహా తెలుగు ఇండియన్‌ ఐడల్‌ 2 వేదిక మీద చార్మింగ్‌గా కనిపించనున్నారు.  ఏప్రిల్‌ 7, 8వ తేదీల్లో ప్రసారమయ్యే ఆహా తెలుగు ఇండియన్‌ ఐడల్‌2 ఎపిసోడ్స్‌లో నాని సందడి చేయనున్నాడు. అంతే కాదు, ఈ వేదిక మీద సింగర్‌ కార్తికేయ నాని మనసు గెలిచారు. హైదరాబాద్‌కు చెందిన కార్తికేయ గళం విన్న నాని మెస్మరైజ్‌ అయ్యారు. తన తదుపరి చిత్రాల్లో కార్తికేయకు గాయకుడిగా అవకాశం ఇస్తానని మాటిచ్చారు. నాని మాటలు విని 16 ఏళ్ల కార్తికేయ ఆనందానికి అవధుల్లేవు.  జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఈ సందర్భంగా పలకరించడం ఆనందంగా ఉందని అన్నారు నాని. తన దసరా ప్యాన్‌ ఇండియా రేంజ్‌ సక్సెస్‌ అయిన సందర్భంగా అందరితోనూ ఆ సంతోషాన్ని పంచుకోవడం హ్యాపీగా ఉందని చెప్పారు నేచురల్‌ స్టార్‌.

ఆహా తెలుగు ఇండియన్‌ ఐడల్‌2కి తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాదు, జాతీయ స్థాయిలో అభిమానులున్నారు. బాలీవుడ్‌, కోలీవుడ్‌ అనే తేడా లేకుండా అందరి దృష్టినీ ఆకట్టుకుంటోంది ఆహా తెలుగు ఇండియన్‌ ఐడల్ 2. సంగీత ప్రపంచంలో ప్రముఖులైన హిమేష్ రేష్మియా, శ్రేయా ఘోషల్‌, విశాల్‌ దడ్లానీ, జీవీ ప్రకాష్‌ తో పాటు ఎంతో మందిని తమ గళాలతో మెప్పిస్తున్నారు గాయనీ గాయకులు. అటు నేచురల్‌ స్టార్‌ నాని, ఇటు ఎస్పీ చరణ్‌ ముఖ్య అతిథులుగా ఈ వారం స్పెషల్‌ ఎపిసోడ్‌ సంగీతాభిమానులకు పండగలా ఉంటుంది. 

Videos

రాత్రి వేళ గోడలు ఎక్కుతూ వేటాడుతున్న వింత రాకాసి!

రెండో టీ20లో వైభవ్ కు చాన్స్.. ఇషాన్ కిషన్ అవుట్

కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న టీడిపీ గూండాల దౌర్జన్యాలు

ఉద్యోగులకు, పెన్షనర్లకు భారీ శుభవార్త.. దీపావళి కానుకగా డీఏ పెంపు..?

70 ఏళ్లపైనే ఉన్నావ్.. లుచ్చా పనులు ఆపేయ్! JCకి పెద్దారెడ్డి మాస్ వార్నింగ్

నా 25ఏళ్ల సన్నిహితంతో చెప్తున్న.. లోకేష్ వల్ల TDP భూస్థాపితం అవ్వడం తథ్యం

చూస్కుందాం...! నువ్వా... నేనా...

వృద్ధుడిని కూడా వదలరా? సొంత పార్టీ నేతలపై టీడీపీ గూండాల దాడులు

26నుంచి భారీ వర్షాలు

మహిళల జుట్టు పట్టుకోవడం, చీరలు లాగడం ఏ రకమైన పాలనకు నిదర్శనం?

Photos

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం